NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు సినిమా

పవన్ కళ్యాణ్ కి అతని అభిమానుల పై ఉన్న ప్రేమ చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి..!

నేడు పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అతని అభిమానులంతా తమ అభిమాన హీరో, నాయకుడి జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు భారీ ఎత్తున సన్నాహాలు చేశారు. హీరోలకి వీర లెవెల్ లో డై-హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు…. అయితే పవన్ కళ్యాణ్ కి ఉన్న అభిమానులు వేరు…. వారి లెక్క వేరు వారికి ఉండే తిక్క వేరు.. వారి వల్ల అతనికి వచ్చే కిక్కే వేరు.

 

Pawan Kalyan takes a dig at Andhra CM over personal remarks

ఫాన్స్ పవన్ కళ్యాణ్ ని ఎంత ప్రేమిస్తారో మనం అతని ఆడియో ఫంక్షన్లలో, బహిరంగసభలలో, అతని సినిమా ఆడుతున్న థియేటర్ బయట చూడవచ్చు. అయితే పవన్ తన అభిమానులను ఉద్దేశించి చాలా కేరింగ్ గా మాట్లాడే మాటలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిలో మచ్చుకు కొన్ని చెప్పుకుందాం….

Pawan Kalyan gathers a massive crowd for his rally

ఒకసారి జనసేన పార్టీ మీటింగ్ లో మీడియా వారితో, రాజకీయ విశ్లేషకులతో చర్చలు జరుగుతున్నప్పుడు ఒకరు పవన్ తో ఇలా అన్నారు –  “మీ అభిమానులు రోడ్డు మీద హల్ చల్ చేస్తున్నారు. బండి వేసుకొని బాగా పోకిరి గా ప్రవర్తిస్తున్నారు” అని చెబుతారు. మీరు పార్టీ పెట్టి అందరికీ విలువలను బోధిస్తూ ఉన్నప్పుడు మీ అభిమానులు వాటిని మొదట ఆచరించాలి కదా అన్నట్లు ఆయనకి ఒక ప్రశ్న ఎదురవుతుంది. దానికి పవన్ కళ్యాణ్ – “కుర్రాళ్ళు బండిని బాగా రైజ్ చేస్తే ఎక్కువ నష్టం ఉందా లేకపోతే రాజకీయ నాయకులు చేస్తున్న అక్రమాలు దోపిడీలు వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం ఉందా?” అని ప్రశ్నిస్తాడు. ముందు ఎలాంటి వాటిని భూతద్దంలో పెట్టి చూడాలి అన్న విషయం పై ఒక అవగాహన ఉండాలని తన అభిమానులను కంట్రోల్లో పెట్టుకోవడం తనకు తెలుసునని… వారికి ఒక మాట చెప్తే చాలు వారు వింటారని పవన్ కళ్యాణ్ చెప్పడం ఇక్కడ విశేషం.

Pawan Kalyan fans, Jana Sena workers in dock - The New Indian Express

మరొకసారి బహిరంగ సభలో ఎవరో అభిమానులు అతన్ని తనివితీరా చూసేందుకు కు పోల్స్ పైకి ఎక్కుతుండగా…. పవన్ స్టేజిపై నుండి వారిని వారించి కిందకి దింపి వేశాడు. అలా చేస్తే ప్రమాదమని…. మీకు చిన్న దెబ్బ తగిలినా నాకు కన్నీళ్లు వస్తాయని పవన్ కళ్యాణ్ అనడం గమనార్హం. ఎంతోమంది అభిమానులు అతనిని చూసినప్పుడు ఆనందం తట్టుకోలేక ఆనంద భాష్పాలు కురిపించడం చూశాము. ఇలా పవన్ కూడా వారి అభిమానాన్ని తట్టుకోలేక అప్పుడప్పుడు స్టేజీపైనే ఆనందంతో కన్నీళ్లు కార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Power star Pawan Kalyan and King Dailog writer Trivikram Srinivas to start a production house together? | Kalyan, Power star, Movies

ఇక అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ… “మీరందరూ ఇల్లు కి వెళ్లేముందు నాకు ఒక ప్రామిస్ చేయాలి. మీరంతా క్షేమంగా వెళ్తారని ప్రమాణం చేయండి” అంటాడు. మీరు నాకు ప్రామిస్ చేస్తే పవన్ కళ్యాణ్ ఎంతో సంతోషిస్తారని…. ఎందుకంటే మీ గురించి అందరి కన్నా ఎక్కువ బాధ్యత తనకే ఉందని…. అతను మీకు ఏమైనా చిన్న ఆపద కలిగినా అస్సలు తట్టుకోలేరని అన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మితభాషి. అయినా పవన్ కళ్యాణ్ లోపల మనస్తత్వాన్ని అతను అర్థం చేసుకున్నట్లు ఎవరూ అర్థం చేసుకోలేరేమో. అతను మాట్లాడు మాట్లాడుతుంటే పవన్ చేతులు కట్టుకుని నిలబడడం చూస్తుంటే ఏ అభిమానికైనా నా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి.

Pawan Kalyan fan: పవన్ కాళ్లు పట్టుకున్న అభిమాని.. బౌన్సర్లను నెట్టి గుండెకు హత్తుకున్న జనసేనాని - pawan kalyan hugs his fan on stage at sye raa pre release event | Samayam Telugu

ఇక తన పుట్టినరోజు నాడు ఇలా ముగ్గురు అభిమానులు చనిపోవడం మాత్రం పవన్ కు తీవ్రమైన దిగ్భ్రాంతి కలిగించే విషయం. అతనికి వారి మీద ఉన్న అపారమైన ప్రేమకు ఇది అతను అనుభవిస్తున్న శిక్ష అని చెప్పుకోవాలా? అభిమానులు ఇకనైనా తమ తల్లిదండ్రుల కోసం తమను విపరీతంగా ప్రేమించే తమ నాయకుడి కోసం అయినా ఇటువంటి రిస్కులు మానుకుంటే మంచిది.

author avatar
arun kanna

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu