NewsOrbit
న్యూస్ సినిమా

‘వకీల్ సాబ్’ గా రెడీ అయిపోయిన పవన్ కళ్యాణ్..! షూటింగ్ ప్యాక్ అప్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తన 26 వ చిత్రం వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి అయిపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు కపూర్, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కింది. హిందీలో అవార్డు విన్నింగ్ ఫిలిం ‘పింక్’ సినిమాకు ఇది రీమేక్ కావడం గమనార్హం.

 

ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి, నివేదాథామస్, అనన్య నగల్ల, ప్రకాష్ రాజ్ తదితర తారాగణం నటించారు. రాజకీయాల్లో తన పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించిన పవన్ రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకులకు కనిపించబోతున్నారు. నిజానికి ఈ చిత్రం ఈ సంవత్సరమే విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది.

తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే ‘మగువా మగువా’ పాట సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీలో ఒరిజినల్ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించగా…. తమిళంలో రీమేక్ లో అజిత్ హీరో పాత్ర వహించాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు స్క్రిప్ట్లో మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేసిందన్న వార్తలు వస్తున్నాయి. అనసూయ భరద్వాజ్, ముఖేష్ రిషి, సుబ్బరాజు వంటి క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమాలో ఉన్నారు.

author avatar
arun kanna

Related posts

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu