తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడానికి రెడీ అయ్యారు. కృష్ణ అదేవిధంగా గుంటూరు జిల్లాలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకోవడానికి పవన్ రెడీ అవుతున్నారు. అదేవిధంగా డిసెంబర్ 3, 4, 5 తేదీలలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పవన్ పర్యటించి బోతున్నారు. తుఫాన్ బాధితులకు భరోసా ఇవ్వటానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా రైతులతో సమావేశమయ్యే వారి కష్టాలను తెలుసుకోవడానికి రెడీ అవుతున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Pawan Kalyan fans eagerly await 'Vakeel Saab', actor's return to cinema after 2 years | The News Minuteఇటీవల ఏపీలో కుండపోత వర్షాల కారణంగా భారీ స్థాయిలో రైతాంగం నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే రైతుల పడుతున్న కష్టాలను గురించి అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మాటల దాడులు చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ మరోపక్క తుఫాన్ ప్రభావిత ముప్పు ప్రాంత రైతులతో భేటీ కావడం ఏపీ రాజకీయవర్గాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

 

నివర్ తుఫాన్ దెబ్బకు ఏపీలో వేలాది ఎకరాల్లో పంట నష్టం చేకూరింది. పవన్ కళ్యాణ్ దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ ప్రజల మధ్యకు వస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని పవన్ పర్యటన అత్యంత భద్రత మధ్య ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తుఫాను బాధిత రైతుల చుట్టూ తిరుగుతున్నాయి.