Pawan Kalyan: చిరంజీవి మూవీ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పవన్ పని చేసిన సినిమా ఏంటో తెలుసా..??

Share

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ అని అందరికీ తెలుసు. చిరంజీవి తమ్ముడిగా సినిమా రంగంలో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ అనతికాలంలోనే.. చిరంజీవి స్థాయి తరహాలో ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న పవన్.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు కూడా సృష్టించడం జరిగింది. చాలా డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకుంటూ మరోపక్క సమాజంపై తనకున్న ప్రేమని పాటల రూపంలో చూపిస్తూ పవన్ తనదైన శైలిలో డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ.. యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇదిలా ఉంటే సినిమా హీరో అవ్వకు ముందు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో… ఒకనోక టైం లో చిరంజీవి.. పవన్ .. కళ్యాణ్ జీవితంలో అసలు ఏమవ్వాలి అనుకుంటున్నాడు.. అని దాని గురించి నాగబాబుకి బాధ్యత అప్పట్లో అప్పగించడం తెలిసిందే.

Watch Lankeshwarudu Full Movie Online in HD Quality only on aha

ఆ సమయంలో పవన్ తన మనసులో ఉన్న మాట డైరెక్టర్ అవ్వాలని.. అనుకుంటున్నట్లు నాగబాబుకి తెలపడం జరిగింది. ఇదే విషయాన్ని చిరంజీవికి అప్పట్లో తెలపగా ఆయన.. తన సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ ని తీసుకోవటం జరిగిందట. పూర్తి విషయంలోకి వెళితే చిరంజీవి నటించిన “లంకేశ్వరుడు” సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పవన్ కళ్యాణ్ పని చేయడం జరిగిందట. ఈ సినిమా దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ గా మొట్టమొదట దాసరి నారాయణరావు దగ్గర ఓనమాలు నేర్చుకోవడం జరిగిందట. ఇదిలా ఉంటే సినిమా అంతా కంప్లీట్ అయ్యాక “లంకేశ్వరుడు” పెద్దగా ఆడకపోయినా కానీ సినిమా టేకింగ్ లో.. అప్పట్లో పవన్ కళ్యాణ్ కి మంచి పేరు రావడం జరిగిందట.

డాడీ సినిమాలో కర్చీఫ్ ఫైట్…

ఇక ఆ తర్వాత పవన్ హీరోగా అవటం మిగతా జర్నీ అంతా మనకు తెలిసిందే. ఇక ఇదే టైంలో హీరోగా రాణిస్తున్నే దర్శకుడిగా “జానీ” సినిమా చేయడం తో పాటు.. “గుడుంబా శంకర్”.. సినిమాకి స్క్రీన్ ప్లే కూడా చేశారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిరంజీవి నటించిన “డాడీ” సినిమాలో కర్చీఫ్ ఫైట్ అప్పట్లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం జరిగింది. డాడీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా గాని పవన్ కంపోజ్ చేసిన ఫైట్ అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాగా ఇలా మల్టీ టాలెంటెడ్.. సినిమాలు చేస్తూ అలరించిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం సినిమా రంగంలో రాణిస్తూనే మరోపక్క రాజకీయరంగంలో కూడా దూసుకుపోతున్నారు. జనసేన పార్టీ అధినేతగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2019 ఎన్నికలలో ఓడిపోయినా గాని ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వంపై పోరాడుతూ ప్రతిపక్ష పార్టీగా రాణిస్తున్నారు.

 

ఒకపక్క రాజకీయ నేతగా మరో పక్క హీరోగా అదేరీతిలో స్టార్టింగ్ లో.. అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టిన పవన్ అన్ని రంగాలలో ఆరితేరుతూ.. సమాజంలో కీలక పాత్ర పోషిస్తూ ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తూ ఉన్నారు. రాజకీయ రంగంలో కంటే ఎక్కువగా ప్రజెంట్ సినిమా రంగంలో పవన్ బిజీబిజీగా గడుపుతున్నారు. “వకిల్ సాబ్” సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం బిమ్ల నాయక్… హరిహర వీరమల్లు తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా, సురేందర్ రెడ్డి.. మరి కొంతమంది దర్శకులు సినిమాలను లైన్ లో పెట్టడం జరిగింది. దాదాపు ఈ రెండు సంవత్సరాలు సినిమాలు కంప్లీట్ చేసి తర్వాత ఇక 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధమవ్వాలి అని.. పవన్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

Amritha Aiyer Beautiful Looks

Gallery Desk

గీతంలో కూల్చివేతలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Special Bureau

Harish Rao: పుట్టిన‌రోజున హ‌రీశ్ రావు సంచ‌ల‌న నిర్ణ‌యం… వైర‌ల్ అవుతున్న ప్ర‌క‌ట‌న‌

sridhar