పాయల్ రాజ్ పుత్ అనగానే మనకు గుర్తొచ్చే సినిమా ఆర్ఎక్స్ 100. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్, కార్తికేయ ఇద్దరి యాక్టింగ్ సూపర్బ్. సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో పాయల్, కార్తికేయకు ఇండస్ట్రీలో ఫుల్లు పాపులారిటీ పెరిగింది. ఆ తర్వాత పాయల్ స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. కార్తికేయ కూడా ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు.

అయితే.. చాలా రోజుల తర్వాత.. ఈ జంట మరోసారి బుల్లితెర మీద సందడి చేసింది. ఆహా వీడియోస్ వారి తమాషా విత్ హర్ష అనే ప్రోగ్రామ్ లో పాయల్, కార్తికేయ సందడి చేశారు. ఈ సందర్భంగా ఇద్దరినీ హర్ష కూడా కాసేపు ఆటపట్టించాడు.
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఆ ప్రోమోలో పాయల్, కార్తికేయ.. ఇద్దరూ చిన్నపిల్లల్లా కొట్టుకున్నారు. ప్రతి విషయానికి కార్తికేయ.. పాయల్ ను ఏదో అనడం.. వెంటనే పాయల్ షట్ అప్ అనడం.. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. చాలాసార్లు పాయల్.. కార్తికేయను షట్ అప్ అనేసింది.
అంటే.. వీళ్లిద్దరి మధ్య షట్ అప్ అనేంత ఫ్రెండ్ షిప్ ఉందన్నమాట.. అంటూ నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.