పబ్లిసిటీ పీక్ గా జరిగితే వీక్ పిక్చర్ కూడా నిలబడిపోతుంది.ఫ్లాప్ టాక్ వచ్చినా దాన్ని చూసే వారు చూస్తూనే ఉంటారు.తాజాగా విడుదలైన పెంగ్విన్ సినిమా విషయంలో ఇదే జరిగింది.ఈ మధ్య అమేజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన చిత్రం ‘పెంగ్విన్’. కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి అమేజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్కి పెట్టింది. ఈ సినిమా చూసినవాళ్లంతా పెదవి విరిచారు. అబ్బే… ఇందులో కొత్తదనం లేదని, క్లైమాక్స్ మరీ వీక్ అని తేల్చేశారు. ఈ సినిమాని దాదాపు 7 కోట్లకు కొనుగోలు చేసింది అమేజాన్. దాంతో ఈ సినిమాతో అమేజాన్ నష్టపోతుందని లెక్కగట్టారు.
కానీ ఆ లెక్కలన్నీ తారుమారు అయ్యాయి. పెంగ్విన్‌కి అమేజాన్ ప్రైమ్‌లో మంచి వ్యూవర్ షిప్ దక్కుతోంది. ఈమధ్య విడుదలైన అన్ని సినిమాలకంటే పెంగ్విన్ కే ఎక్కువ వ్యూస్ వచ్చాయని అమేజాన్ స్వయంగా ప్రకటించింది. అమేజాన్ హిట్ సినిమాల్నీ, హిట్ వెబ్ సిరీస్‌లనూ దాటుకుని పెంగ్విన్ వ్యూవర్ షిప్ దక్కించుకుందని తెలుస్తోంది. ఈ సినిమాని మూడు భాషల్లో విడుదల చేయడం, కీర్తి లాంటి స్టార్ ఉండడం బాగా కలిసొచ్చాయి. బయట టాక్ ఎలా వున్నా – ఓటీటీ లెక్కల ప్రకారం ఈ సినిమా హిట్టయినట్టే. ఇక పెంగ్విన్ నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ దక్కింది.అమెజాన్ కు ఏడు కోట్ల రూపాయలకు అమ్మేసిన ఈ సినిమాకి వీక్షకుల సంఖ్య ఆధారంగా కూడా అదనపు మొత్తాన్ని చెల్లించాలన్న ఒప్పందాన్ని నిర్మాతలు చేసుకున్నట్లు తెలుస్తోంది .అందువల్ల మరిన్ని కోట్లు పెంగ్విన్ నిర్మాతలకు దక్కే అవకాశం ఉంది .త్వరలో రాబోయే మరిన్ని ఓటీటీ సినిమాలకు ఈ లెక్కలు ఊతం అందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.ఏదేమైనా ఓటీటీ ప్లాట్ ఫారమ్ చిన్న నిర్మాతలకు అద్భుతమైన ఆదాయ వనరుగా మారుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?