NewsOrbit
న్యూస్

కొత్త డిమాండ్ : సోనుసూద్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి..!

భారతదేశ చలనచిత్ర నటుడు సోనుసూద్ తన కెరీర్ లో మెజారిటీ సినిమాల్లో విలన్ పాత్రలో నటించినా… ఇప్పుడు మాత్రం రియల్ లైఫ్ లో హీరో గా వెలుగొందుతున్నాడు. కరోనా కష్టకాలంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల తో సమానంగా…. గట్టిగా చెప్పాలంటే అంతకుమించి సేవ చేస్తున్న సోనూసూద్ కి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని సోషల్ మీడియాలో ఒక కొత్త గళం లేచింది. 

 

Coronavirus Outbreak: Sonu Sood arranges transport for migrant ...

ముందుగా భారత దేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఉన్న వలస కార్మికులు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు బస్సులను ఏర్పాటు చేసి వారికి ఆహార సదుపాయాలను కల్పించి సహాయ పడిన సోనూసూద్ ఆ తర్వాత విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి రప్పించేందుకు సొంతంగా చార్టెడ్ ఫ్లైట్లను పంపించాడు. ఇలా ఈ కరోనా లాక్డౌన్ సమయం మొత్తం కష్టాలు పడుతున్న వారికి ఎన్నో రకాలుగా సహాయపడిన సోనూసూద్ కొన్ని వేల మందికి సహాయం చేశాడు అంటే అతిశయోక్తి కాదు.

VIDEO: Sonu Sood sends migrant workers of UP & Bihar back to their ...

అంతెందుకు నిన్న, మొన్న అనగా గడిచిన రెండు రోజుల్లోనే రెండు కుటుంబాలను ఆదుకున్నాడు. మొదట ఒక కుటుంబానికి జీవనాధారమైన గోవును తన కూతురు ఆన్లైన్ క్లాసులు సజావుగా సాగేందుకు ల్యాప్ టాప్ లేదని ఆమ్మేసిన కుటుంబానికి తిరిగి ఆ గోవును అందించిన సోను సూద్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి జిల్లాలో ఎద్దులు లేక తన ఇద్దరు కూతుర్ల ను వాటి స్థానంలో ఉంచి పొలం దున్నిస్తున్న వారి బాధను చూసి చలించిపోయాడు. మీకు ఈ పరిస్థితుల్లో కావాల్సింది ఎద్దులు కూడా కాదు ట్రాక్టర్ అని ఏకంగా ఒక ట్రాక్టర్ నే వారికి కొనిస్తున్నాడు.

సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఇతర వెబ్ సైట్ల ద్వారా దేశం నలుమూలల లో ఎవరికీ ఏ సహాయం కావాలన్నా ముందు స్పందించే సోనుసూద్ తన సొంత డబ్బులతోనే కాకుండా తానే స్వయంగా దాతలను ఇలా సహాయం చేయమని అర్థిస్తున్నాడు. అంతే కాకుండా అతను ఎటువంటి ట్రస్టు లేకుండా రాజకీయ లబ్ది లేకుండా ఇలా చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. 

సినిమాల్లో నుండి రాజకీయాల్లోకి వస్తున్న వారు మరియు రాజకీయాల్లోకి కేవలం సేవ చేయడానికే వస్తున్నాం అని చెప్పుకునే వారు సోనూసూద్ ని చూసి ఎంతో నేర్చుకోవాలి. మరియు ఇప్పటివరకు పక్కదారి పట్టి సేవ పేరుతో ప్రజలను దోచుకుంటున్న వారు బుద్ధి తెచ్చుకోవాలని నెటిజన్లు అంటున్నారు. ఇలాంతి సేవ చేస్తున్న సోనూసూద్ కి నోబెల్ బహుమతి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నిస్తున్నారు అంతా. ఇక భారత్ లాంటి దేశంలో ఇంతటి జనాదరణ కలిగిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సోనూసూద్ తన నిస్వార్థ సేవ ద్వారా సాధించిన ఘనత అలాంటిది మరి.

author avatar
arun kanna

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju