NewsOrbit
న్యూస్

విదేశాల్లో ఉన్న‌వారు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఇలా వీక్షించ‌వ‌చ్చు..!

మ‌రో 4 రోజుల్లో ఐపీఎల్ 2020 టోర్నీ ప్రారంభ‌మ‌వుతున్న నేప‌థ్యంలో ఫ్యాన్స్ అంద‌రూ ఆస‌క్తిగా మ్యాచ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. క‌రోనా నేప‌థ్యంలో ఈ సారి టోర్నీ ఇప్ప‌టికే బాగా ఆల‌స్యం కాగా.. టోర్న‌మెంట్ మొత్తాన్ని యూఏఈలోనే నిర్వ‌హిస్తున్నారు. ఇక స్టేడియాల్లో ప్రేక్ష‌కులు లేకుండానే మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. దీంతో ఈసారి ప్రేక్ష‌కులు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా టీవీల్లో లేదా డిజిట‌ల్ ప్లాట్‌ఫాంల‌పై చూడాల్సి వ‌స్తోంది.

people living in these countries can watch ipl on yupp tv

అయితే భార‌త్‌లో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ప్ర‌సారం చేసేందుకు స్టార్ టీవీ హ‌క్కుల‌ను క‌లిగి ఉన్న విష‌యం విదిత‌మే. స్టార్ స్పోర్ట్స్‌లో ప‌లు భిన్న భాష‌ల్లో కామెంట్రీతో మ్యాచ్‌లు ప్ర‌సారం కానున్నాయి. అలాగే భార‌త్‌లో హాట్ స్టార్ యాప్ ద్వారా డిజిట‌ల్ ప్లాట్‌ఫాంపై ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూసేందుకు అవ‌కాశం ఉంది. కానీ ఇత‌ర దేశాల్లో ఉన్న వారు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను చూడ‌డం ఎలా..? అని సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. అలాంటి వారి కోస‌మే య‌ప్ టీవీ (YuppTV) అందుబాటులో ఉంది.

య‌ప్ టీవీ ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను ఇత‌ర దేశాల్లో ఉన్న‌వారు వీక్షించ‌వ‌చ్చు. ఆస్ట్రేలియా, యూర‌ప్‌, మ‌లేషియా, శ్రీ‌లంక‌, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవ్స్‌, మ‌ధ్య ఆసియా, మ‌ధ్య, ద‌క్షిణ అమెరికాల‌లో ఉండేవారు ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను య‌ప్ టీవీ ప్లాట్‌ఫాంపై వీక్షింవ‌చ్చు. కాగా య‌ప్ టీవీ ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఇంట‌ర్నెట్ బేస్డ్ టీవీ, ఆన్ డిమాండ్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్‌గా అవ‌త‌రించింది. అందులో 250కి పైగా టీవీ చాన‌ల్స్‌, 3వేల‌కు పైగా మూవీలు, 100కు పైగా టీవీ షోల‌ను చూడ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలోనే త్వ‌ర‌లో ఆయా దేశాల్లో ఉండేవారు య‌ప్ టీవీలో ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను కూడా చూసేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

author avatar
Srikanth A

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju