న్యూస్ హెల్త్

కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి మీరు ఇలా ఉంటే మాత్రం వెళ్లకండి!!

Share

కరోనా నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో అత్యవసర వినియోగానికి కేంద్రం రెండు వ్యాక్సిన్ లకు మాత్రమే అనుమతించిన ఇచ్చింది. ఆ రెండు వాక్సిన్ లలో ఒకటి కోవాక్సిన్. అయితే, కోవాక్సిన్ తీసుకోవాలి అనుకునేవారు మాత్రం టీకా తీసుకునే ముందు ఒక సమ్మతి పత్రంపై సంతకం చేసి షరతులు అంగీకరించాలిసి ఉంటుంది.

ఇప్పటి వరకు భారత్ బయోటెక్ వాక్సిన్ తీసుకున్న వారిలో టీకాకు ప్రతికూల ఫలితాలు కనిపించాయి. ఇక దీనితో తాజాగా భారత్ బయోటెక్ కావాక్సీన్ వాక్సిన్ మీద ఓ హెచ్చరిక జారీ చేసింది. ఎవరికయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందొ,  లేదా రోగనిరోధక శక్తి కోసం మందులు వాడుతున్నారో అటువంటి  వారు కోవాక్సిన్ టీకా తీసుకోకూడదని నిషేధం విధిస్తు భారత్ బయోటెక్ ఒక ఫాక్స్ షీట్ ద్వారా సలహా ఇచ్చింది.

ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొనేవారు ముందుగా తమకు ఏవైనా అలెర్జీలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఇతర సమస్యలు ఉంటే వ్యాక్సిన్ ఇస్తున్న అధికారికి చెప్పాలని వాటిని చెప్పిన తర్వాతే ఆ వ్యక్తికి వ్యాక్సిన్ ఇవ్వాలా వద్దా అన్న అంశాన్ని వైద్యులు నిర్ణయించి వ్యాక్సిన్ ఇస్తారని స్పష్టంగా ఆ ఫాక్ట్ షీట్ లో పేర్కొంది. 

అలెర్జీ లేదా జ్వరం తో ఉన్నవారు అలాగే రక్తస్రావం ఉన్నవారు లేదా శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు కానీ, గర్భవతులు, తల్లి పాలివ్వడం లేదా ఇతర ఏ కరోనా వ్యాక్సిన్ ను అయినా తీసుకున్నవారు కానీ ఈ కోవాక్సిన్ వ్యాక్సిన్ ను తీసుకోకూడదని భారత్ బయోటెక్ సూచిస్తుంది. 

వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొందరి లో కనిపిస్తున్న రియాక్షన్ లు ఏమనగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం మరియు గొంతు వాపు లేదా వేగంగా గుండె కొట్టుకోవడం, శరీరమంతా దద్దుర్లు రావడం వంటివి కనిపిస్తున్నాయని తెలిపింది భరత్ బయోటెక్  కంపెనీ. 

 

 


Share

Related posts

Covid 19 : బిగ్ బ్రేకింగ్ : ఆ మాజీ క్రికెటర్ దిగ్గజానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ

somaraju sharma

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” లో నిధి అగర్వాల్ వైరల్ లుక్..!!

sekhar

Elachi: యలకులతో ఈ పానీయం తాగితే కలిగే ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..!!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar