Pawan Kalyan: సన్నాసి అని పవన్ చేసిన కామెంట్లకు.. పేర్ని నాని రియాక్షన్..!!

Share

Pawan Kalyan: ఏపీ సమాచార శాఖ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని నీ.. ఉద్దేశించి “రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో.. పవన్ పరోక్ష వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఈ క్రమంలో పేర్ని నాని ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి పవన్ సన్నాసి అని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్కళ్యాణ్ మేము ఒకే కులానికి చెందిన వాళ్ళము అని.. “నేను కాపు నా కొడుకునే సన్నాసి నే…, పవన్ ని ఉద్దేశించి.. “ఆడు .. పవన్ నాయుడు గాడు కూడా సన్నాసే… మేము వాడు వీడు అని తిటుకుంటం.. ఒకే కులానికి చెందినవాళ్ళం.

Pawan Kalyan's explosions at Republic Pre Release function

ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లం కాబట్టి తిట్టుకున్న తప్పు లేదని సెటైరికల్ కామెంట్ చేశారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కి సంబంధించి మీడియా పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంలో పేర్ని నాని ఖండించారు. అనంతరం.. పవన్ చేసిన వ్యాఖ్యలు జగన్ మీద విషం చిమ్మేలా ఉన్నాయని… సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎనిమిది వందల ధియేటర్లలో సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయని, తెలంగాణలో కేవలం 413 మాత్రమే నడుస్తున్నాయని… రిలీజ్ అయిన లవ్ స్టోరీ సినిమా.. ఇప్పటికీ ఏపీలో ఎక్కువ కలెక్షన్లు సాధిస్తూ ప్రదర్శితం అవుతుందని స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉంటే కేసిఆర్ నీ.. ప్రశ్నించే దమ్ము ధైర్యం పవన్ కళ్యాణ్ కి ఉందా అంటూ.. మీడియా ముందు పేర్నినాని నిలదీశారు. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ షేర్ నిర్మాతలకు ఏపీలోని వస్తుందని తెలిపారు. నోరు ఉందికదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఊరుకోరని.. పెర్ని నాని ఘాటుగా పవన్ వ్యాఖ్యలకు రిప్లై ఇచ్చారు.


Share

Related posts

సంచలన నిర్ణయం దిశగా గుంటూరు.., కృష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు…!

Srinivas Manem

కీర్తి సురేష్ రేంజ్ పాపులారిటీని ఇలా దింపేస్తున్నారా ..?

GRK

KCR: కేసీఆర్ , జ‌గ‌న్ … ఒకే మాట‌పై ఉంటార‌ట‌

sridhar