(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఈ మాయ ఎప్పుడన్నా చూశారా. మతి పోగొట్టే ఈ కనికట్టు ట్విట్టర్లో సంచలనం కలిగిస్తోంది. దీని పేరు నిరంతర వజ్రం (perpetual diamond). బూడిద రంగు చతురస్రంపై లేత వంకాయ రంగు డైమండ్ ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే డైమండ్ కదులుతూ ఉంటుంది. నిజం ఏమిటంటే డైమండ్ అక్కడ నుంచి కాస్త కూడా కదలదు. కానీ కదులుతున్నట్లు మనం భ్రమ పడతాం. వెనక నుంచి వచ్చే లైట్ ప్లాష్, డైమండ్ పదునైన అంచులు కలిసి మనకు ఆ భ్రమ కలిగిస్తాయి.
ఆలివర్ ఫ్లిన్, ఆర్థర్ షేపిరో అనే పరిశోధకులు ఈ నిరంతర వజ్రం రూపొందించారు. ట్విట్టర్లో దీనిని చూసిన వారు చాలామంది అయోమయానికి లోనవుతున్నారు. ఇది వేలమందిని ఆకర్షించింది. అనేకమంది దీనిని రీట్వీట్ చేశారు.
The perptual diamond: The diamond remains fixed in one place but appears to move up, down, left, or, right. See how far away you can be from your screen before the effect goes away. From https://t.co/XRFKTtjOfm pic.twitter.com/af7BOUCvfC
— Arthur Shapiro (@agshapiro2) June 2, 2019
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?