నయిాం ఆస్తుల జప్తునకు పిటిషన్

నయిాం ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఐటి శాఖ పిటిషన్

ఢిల్లీ, జనవరి 4: గ్యాంగ్‌స్టర్ నయిం కేసులో ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఆదాయపన్నుశాఖ శుక్రవారం  కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నయిాంపై ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఆదాయపన్నుశాఖ దర్యాప్తు పూర్తి చేసి ఆస్తుల జప్తుకు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఈడీ కోర్టును కోరింది. ఐటి శాఖ నయిాం ఆస్తులు 1200 కోట్లుగా లెక్కతేల్చింది. అనేక చోట్ల నయిాం బినామీ అస్తులు ఉన్నట్లు గుర్తించారు.

2016 ఆగస్టు ఎనిమిదవ తేదీన   పోలీసులు షాద్‌నగర్‌లో జరిగిన  ఎన్‌కౌంటర్‌లో నయిాంను హతమార్చారు.

గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయిాం కూడబెట్టిన ఆస్తుల విలువ తెలంగాణా  సీఎం కేసీఆర్ అప్పట్లో 143 కోట్ల రూపాయల మేర ఉంటుందని ప్రకటించారు.  27 హత్యకేసులతోపాటుగా మరో 25 కేసుల్లో అతడి ముఠా పాలుపంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. నయిాం బంధువులతోపాటుగా అనేక మంది రాజకీయ నేతల ఇళ్ళపైన అధికారులు దాడులు నిర్వహించి నగదు, పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.  ఈ కేసును సిట్‌ నుంచి ఈడీ స్వీకరించింది.