NewsOrbit
న్యూస్

Petrol Diesel Prices: భగ్గుమంటున్న పెట్రోల్ ధరలు…వరుసగా 8 రోజుల్లో 7 సార్లు…

Petrol Diesel Prices: దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం (మార్చి 29) మరో సారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు వాహనదారులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే ఉన్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది ఏడో సారి. చమురు సంస్థలు లీటర్ పెట్రోల్ పై 90పైసలు, డీజిల్ పై 76 పైసలు చొప్పున పెంచాయి. తాజా పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.61 లు కాగా, డీజిల్ ధర రూ.99.83లు గా ఉంది. విజయవాడలో పెట్రోల్ లీటర్ రూ.115.37లు, డీజిల్ రూ.101.23లుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.100.21లు, డీజిల్ ధర రూ.91.47లు, ముంబాయిలో పెట్రోల్ రూ.115.04, డీజిల్ రూ.99.25, చెన్నై లో లీటర్ పెట్రోల్ ధర రూ.105.94, డీజిల్ ధర రూ.96, కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.109.68, డీజిల్ ధర రూ.94.62లుగా ఉంది. రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఇటీవల పైకి, కిందకు కదులుతున్నాయి. ఈ ప్రభావం దేశీయంగా పెట్రోల్, డీజిల్ పైన ఉంటోంది.

Petrol Diesel Prices hike once again in India
Petrol Diesel Prices hike once again in India

 

Petrol Diesel Prices: ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో చర్చించాలి

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతి రోజూ మారుతాయి. ఉదయం 6 గంటలకు సవరిస్తుంటారు. మరో పక్క ఇంధన ధరల పెంపును ఉపసంహరించుకోవాలని, ఈ అంశంపై ప్రధాన మంత్రి మోడీ పార్లమెంట్ లో ప్రకటన చేయాలని విపక్షాలు నిన్న డిమాండ్ చేశాయి. ధరల పెరుగుదలకు రష్యా – ఉక్రెయిన్ యుద్ధమే కారణమని ప్రభుత్వం చెబుతున్న వాదనలను విపక్షాలు తోసిపుచ్చాయి. జీరో అవర్ లో లోక్ సభలో కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు పెట్రోల్ ధరలపై మాట్లాడారు. ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలు, వేతన జీవులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్ లో చర్చించాలనీ, దీనిపై ప్రధాన మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N