NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

చమురు తగ్గినా… పెట్రోల్ పెరిగెను… రహస్యం ఇదే…!!

పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకి పెరుగుతుంది. ఈ పెరుగుదల కూడా నొప్పి తెలియకుండా రోజుకి 50 , 60 పైసలు పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ నెల 8 నాటికి ఉన్న ధరల కంటే ప్రస్తుతం లీటర్ పై రూ. 8 పెరిగింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్ లో చూసుకుంటే చమురు ధరలు బాగా తగ్గుతున్నాయి.
* ఇటుక, ఇసుక, ఇనుము ధరలు తగ్గితే ఇంటి నిర్మాణ ధర తగ్గుతుంది…! మరి ఇదే తీరున ముడి చమురు ధర తగ్గినప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడానా తగ్గాలిగా… కానీ తగ్గడం లేదు. పెరుగుతున్నాయి. అందుకు పన్నులే కారణం. ఆ పన్నులు కూడా పెంచుకుంటూ ఉండడం అనేక ఇతర రంగాలపైనా ప్రభావం చూపుతుంది.

ఏమి తేడా లేదు…!

2014 లో బ్యారెల్ చమురు ధర 108 డాలర్లు… అప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ. 77 .. ఇప్పుడు బ్యారెల్ చమురు ధర 42 డాలర్లు. కానీ నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు 2014 లాగానే ఉన్నాయి. 75 నుండి 80 ఉండగా… అప్పుడు, ఇప్పుడు అదే ధర ఉంది. ముడి చమురు ధర 60 శాతం తగ్గినా పెట్రోల్ థలా మాత్రం రూపాయి కూడా తగ్గలేదు. తిరిగి పెరుగుతుంది. దీనికి ఏకైక కారణం పెన్నులు రూపంలో పెంచుతుండడమే.
* పెట్రోల్ , డీజిల్ పై రకరకాల పన్నులు ఉంటాయి. కస్టమ్స్ డ్యూటీ, సెంట్రల్, స్టేట్ ఎక్సయిజ్ డ్యూటీ, రోడ్ అభివృద్ధి సెస్.., ఇన్ని రకాల పన్నులు ఉంటాయి. నిజానికి లీటర్ పెట్రోల్ ధర రూ. 22 మాత్రమే ఉండగా, మిగిలిన నగదు అంతా పన్నులు రూపంలో వెళ్తున్నదే.

ఆదాయంలో మొదటి స్థానం…!

పన్నులు వేసుకుంటూ పోతే ప్రభుత్వాలకు ఆదాయం వస్తుందా అంటే..? కచ్చితంగా వస్తుంది. కేంద్రానికి ప్రధాన ఆదాయ మార్గాల్లో పెట్రోల్ మొదటి స్థానంలో ఉంది. ఏటా రెండున్నర లక్షల కోట్లు ఆదాయం వస్తుంది. లిక్కర్, కొనుగోళ్లు, జీఎస్టీ, తదితర మార్గాలు ఇతర స్థానాల్లో ఉన్నాయి. అందుకే దేశానికి ఆదాయం కావాల్సిన ప్రతిసారి మొదట గుర్తొచ్చేది పెట్రోల్ ధరల పెంపు మాత్రమే. కేవలం పెట్రోల్ ని ఆదాయ మార్గంగా చూస్తున్న కారణంగానే మధ్యతరగతి వర్గాల అవసరాలు కూడా ఆలోచించకుండా ధరలు పెంచుతుంటారు. నిజానికి నాటి చమురు చారాలతో పోలిస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 40 వరకు ఉండాలి.

కుడి చేత్తో వస్తున్నా… ఎడమ చేత్తో పోతుంది.,.!!

రెండు చేతులా సంపాదిస్తేనే ఆదాయం నిలబడేది, కనబడేది. కానీ ప్రభుత్వం నేరుగా పెట్రోల్ రూపంలో లాగేస్తుంది. పన్నులు పిండుతుంది. కానీ ఆ ధరల పెంపు వలన ఇతర మార్గాల్లో తగ్గుతున్న ఆదాయాన్ని అంచనా వేయడం లేదు. పెట్రో అమ్మకాలు నిలకడాగా ఉంటేనే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. ధరలు పెరిగితే వినియోగం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూసుకుంటే ఆర్ధిక వృద్ధి రేట్ పెరగాలి అంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. లావాదేవీలు పెరగాలి. అప్పుడే కొనుగోలు శక్తి తగ్గుతుంది. డీజిల్ ధరలు పెరిగితే రోడ్డు రవాణా ధరలు పెరుగుతాయి. తద్వారా అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరిగితే ప్రజల్లో కొనుగోళ్లు తగ్గుతాయి. ఇలా పరోక్షంగా ప్రభుత్వ ఆదాయం కొంత తగ్గుతుంది. కానీ పెట్రోల్ ధరలే కాస్త అటూ, ఇటుగా ఉంచితే, నిలకడగా ఉంచితే జనంలో సంతోషం ఉంటుంది, కొనుగోళ్లలో వృద్ధి ఉంటుంది.

author avatar
Srinivas Manem

Related posts

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk