PF Account: మీకు PF అకౌంట్ ఉంటే, మీరు ఖచ్చితంగా మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మీ PF అకౌంట్‌ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం మర్చిపోవద్దు. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆధార్ నెంబర్‌తో EPF అకౌంట్ అనుసంధానం చేసుకోవడానికి రేపు అనగా, డిసెంబర్ 31 గడువుగా ఉంది. అంటే ఒకే ఒక్క రోజు మాత్రమే ఇంకా గడువు ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి విస్మరించవద్దు. ఒకేవేళ లింక్ చేసుకోకపోతే PF ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం ఒకింత కష్టమే అని చెప్పుకోవాలి.
ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకోండి?
సోషల్ సెక్యూరిటీ కోడ్ ‘సెక్షన్ 142’ ప్రకారం.. PF ఖాతాను ఖచ్చితంగా ఆధార్‌తో అనుసంధానం చేయవలసి ఉంటుంది. ఒకవేళ లింక్ చేసుకోకపోతే మీరు పనిచేస్తున్న కంపెనీలు మీ PF ఖాతాలో సో కాల్డ్ కంట్రిబ్యూషన్ డబ్బులు జమ చేయవు అని చెబుతున్నాయి. అందువల్ల మీకు చాలా నష్టం జరిగే అవకాశం వుంది. అలాగే PF డబ్బులు కూడా ఆన్లైన్లో విత్‌డ్రా చేసుకోవడం కష్టం అవుతుంది. అలాగే ఇతర ఫెసిలిటీలు కూడా పొందలేరు. అందుకని వెంటనే ఇప్పుడే.. ఈ క్షణమే ఆ పని చేయండి.
అదెలాగో తెలుసుకోవాలంటే ఇది చుడండి..
1. ముందుగా మీరు మీ EPFO అకౌంట్ లాగిన్ అవ్వండి.
2. ఆన్లైన్ సర్వీసెస్‌లోకి వెళ్లి EKYCపై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తరువాత మీకు OTP వస్తుంది.
3. దాన్ని ఎంటర్ చేసాక మీ పీఎఫ్ ఖాతాతో ఆధార్ లింక్ అవుతుంది.
4. ఒకవేళ ఆధార్ నెంబర్ లింక్ కాకపోతే.. పుట్టిన తేదీ వంటి వాటిల్లో ఏమైనా తప్పులు ఉంటే ఆధార్ నెంబర్ లింక్ కాదు. అప్పుడు మీరు మై ప్రొఫైల్లోకి వెళ్లాలి.
5. అక్కడ మీ పేరును ఆధార్ కార్డులో ఉన్నట్టు చెక్ చేసుకోవాలి.
6. తరువాత మీరు పని చేసే కంపెనీ మీరు చేసిన సవరణలకు ఓకే చేయాల్సి ఉంటుంది.
7. తర్వాత మళ్లీ ఆధార్‌తో లింక్ చేసుకోవాలి.
8. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమంటే.. PF ఖాతాతో, ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్లు మన వద్దనే ఉంచుకోవాలి.
దక్షిణాది సినిమా రంగంలో తుని దారులకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తమిళ సినిమా రంగంలో అయితే హీరో లేదా హీరోయిన్ నచ్చాడు అంటే విగ్రహాలు కట్టేస్తారు...…
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన "పుష్ప" ఎంతటి ఘనవిజయం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన ఈ సినిమా…
ఢిల్లీ నూతన ఎక్సేజ్ పాలసీ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) హైదరాబాద్ లోని ఓ ప్రముఖ వ్యాపారి నివాసంలోనూ తనిఖీలు చేసింది. హైదరాబాద్ కోకాపేటలోని ప్రముఖ…
విభిన్న చిత్రాలకు కేరాఫ్‌గా మారిన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్.. రీసెంట్గా `కార్తికేయ 2`తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. 2014లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్…
విజయవాడ కు చెందిన పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధిని (17) గత నెల 22వ తేదీన ఏలూరు కాలువలో దూకింది. రాత్రి సమయంలో అందరూ చూస్తుండగానే…
ఒకప్పటి హీరోయిన్ నమిత పండండి కవలలకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఆమె నేడు కృష్ణాష్టమి సందర్భంగా రివిల్ చేసింది. `జెమిని` మూవీతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు…