NewsOrbit
జాతీయం న్యూస్

డోలో – 650 సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చిన ఫార్మా అసోసియేషన్

కరోనా సమయంలో ప్యారాసెటమాల్ 650 (డోలో 650) మాత్రలను సిఫార్సు చేసినందుకు వైద్యులకు సదరు ఉత్పత్తి సంస్థ మైక్రో ల్యాబ్స్ వెయ్యి కోట్ల రూపాయలు తాయిలాలుగా ఖర్చు చేసిందన్న ఆరోపణలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ సమాఖ్య గత నెలలో సుప్రీం కోర్టులో మైక్రోల్యాబ్స్ కు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం, ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ తరుణంలో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి స్టడీ చేసిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలియన్స్ (ఐపీఏ) .. డోలో – 650 తయారీ సంస్థ అయిన బెంగళూరుకు చెందిన మైక్రో ల్యాబ్స్ కు క్లీన్ చిట్ ఇచ్చింది.

Dolo 650 IPA

వెయ్యి కోట్ల తాయిలాల ఆరోపణలపై ఇంతకు ముందే మైక్రో ల్యాబ్ సంస్థ స్పందించింది. తమ సంస్థపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ జయరాజ్ గోవిందరాజు గత నెలలో ర్కొన్నారు. కరోనా సమయంలో డోలో 650 మాత్రల మార్కెటింగ్ కోసం తాము వెయ్యి కోట్లు ఖర్చు చేశామని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఎందుకంటే గత ఏడాది అత్యధికంగా అమ్మకం జరిగిన ఈ బ్రాండ్ ద్వారా తమకు రూ.350 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. రూ.350 కోట్ల ఆదాయానికి వెయ్యి కోట్లు ఎవరైనా ఖర్చు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. తామే కాదు ఏ సంస్థ కూడా ఒక బ్రాండ్ కోసం అంత ఖర్చు చేయదని ఆయన అన్నారు.

ఇదిలా ఉంటే డోలో 650 తయారీ సంస్థపై వచ్చిన ఆరోపణలపై స్పందించి అధ్యయనం చేసిన ఐపీఏ ఒక నివేదికను కేంద్ర రసాయనాల శాఖ పరిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీకి ఒక నివేదిక సమర్పించింది. ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ విధానాల మార్గదర్శకాలను మైక్రో ల్యాబ్స్ అనుసరించినట్లు తన నివేదికలో ఐపీఏ తెలిపింది. అనైతిక, తప్పుడు విధానాలను అనుసరించిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పింది ఐపీఏ. ఒక ఏడాదిలో ఒక్క డోలో 650 బ్రాండ్ పై తాయిలాల కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేసినట్లుగా చెప్పడం అసమంజసమని ఐపీఏ పేర్కొంది.

Dolo 650 టాబ్లెట్ హానికరమా? డాక్టర్లు లంచాలు తీసుకొని బలవంతంగా సజెస్ట్ చేస్తున్నారు? 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju