NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

దెయ్యం పేరుతో బాలికలపై మాంత్రికుడు అత్యాచారం.. చివరికి?

చెన్నై: ఎన్ని కఠిన శిక్షలు అమలు చేసినా, ఎన్నో రకాల చట్టాలు తీసుకొచ్చినా సమాజంలో అమ్మాయిల పట్ల జరుగుతున్న దారుణాలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకరకంగా అమ్మాయిలు మగాళ్లకు బలి అవుతూనే ఉన్నారు. దేశంలో ఏదో ఒక మూలన అమ్మాయిలు మగాళ్ల చేతిలో వేదింపబడుతూనే ఉన్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన బిడ్డ మళ్లీ తిరిగొస్తుందన్న నమ్మకం నేటి తల్లిదండ్రులకు లేకుండా పోయింది. ఏడో ఒక చోట ఇలాంటి ఘటనలు బయటకు వస్తున్నాయి. కాని చాలా మటుకు ఇలాంటి దారుణాలు ప్రభుత్వాల దరికి చేరడం లేదు. అందుకేనేమో ఇలాంటి దారుణాలు రోజురోజుకూ అధికమవుతూనే ఉన్నాయి.

ఇంకా చెప్పాలంటే ఇలాంటి దారుణాల పట్ల ప్రభుత్వాలు త్వరితగతిన శిక్షలు వేయడం లేదు. దీనితో పాటుగా మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే అసలు ఇలాంటి దారుణాలకు శిక్షలు కూడా వేస్తున్నారా అని ప్రజలు వాపోతున్నారంటే నమ్మండి. ఇలా ఉంది మన ప్రభుత్వాల తీరు. ఎంతో మంది స్త్రీల పట్ల దారుణంగా ప్రవర్తించినా ఎలాంటి శిక్షలు లేకుండా దర్జాగా తిరిగేస్తున్నారు. కాని దారుణానికి గురైన అమ్మాయిలు మాత్రం ఈ భూమిపై మిగలటం లేదు. లైంఘికంగా వేదింపబడి ఎంతో మంది అమ్మాయిలు చంపబడ్డారు, ఆత్మ హత్యలకు పాల్పడ్డారు.

అయితే తాజాగా దెయ్యం వదిలిస్తానంటూ మాయ మాటలు చెప్పి అభం శుభం తెలియని ఇద్దరు బాలికలపైన అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఓ కామాందుడు. వివరాళ్లోకి వెళితే.. సేలం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పోషించడం కోసం ఓ రైతు తోటలో పనిచేసేవాడు. అతనితో పాటుగా అతని భార్య పిల్లలు15,13 ఏండ్ల కుమార్తెలు అక్కడే నివసించేవాడు. అయితే అతని కుమార్తెలు కొంతకాలంగా ఎవ్వరితోనూ సరిగా మాట్లాడకపోవడంతో దెయ్య పట్టిందని భావించాడు తండ్రి. ఇంకేముంది నామక్కల్ జిల్లాకు చెందిన శేఖర్ ను అనే మాంత్రికుడి రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని సంప్రదించారు.

అయితే అతను ఆ అమ్మాయిలకు పట్టిన దెయ్యాన్ని వదలగొడతానని అందుకోసం ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు చేయాలని దానికి ఆ అమ్మాయిలను అక్కడే వదిలి వెళ్లమని ఆ మాయల మాంత్రికుడు నమ్మబలికాడు. అది నిజమేననుకుని ఆ అమ్మాయిల తల్లిదండ్రులు ఆ పిల్లలను అక్కడే వదిలేసి వెళ్లారు. అదే అదనుగా భావించిన నకిలీ మాంత్రికుడు ఆ బాలికలపై పలు మార్లు అత్యాచారానికి ఒడిగట్టాడు. కాని ఆ విషయాన్ని అతనిపై ఉన్న భయంతో చెప్పలేదు. అయితే అతని ప్రవర్తన మరింత తీవ్రతరం కావడంతో ఆ బాలికలు ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో బాలికల తల్లిదండ్రులు మంగళాపురం పోలీస్ స్టషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆ మంత్రగాడిని విచారించి కటకటాలకు పంపారు. అత్యాధునిక టెక్నాలజీ వచ్చిన సమాజంలో దెయ్యాలు, బూతాలు అంటూ ఇలాంటి దారుణాలకు గురికాకుండా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా మంత్రాలకు చింతకాయలు రాలవనే సత్యాన్ని అంగీకరించినప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి.

Related posts

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju