వాహన ప్రియుల అవసరాలను తీర్చడానికి పియాజియో Piaggio కంపెనీ తనదైన శైలిలో సరికొత్త మోడల్స్ మార్కెట్లో విడుదల చేసి ఎప్పటికప్పుడు ముందుంటుంది..! ఎట్టకేలకు భారత మార్కెట్లో తన ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160(Aprilia SXR 160 ) స్కూటర్‌ను విడుదల చేసింది..! ఎంతో కాలంగా భారత ద్విచక్ర వాహన ప్రియులు ఎదురు చూస్తున్నా స్కూటర్ ఇది.. నాలుగు కలర్ ఆప్షన్స్ లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది.. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో ఈ ప్రీమియం స్కూటర్ వాహన ప్రియులను ఆకర్షిస్తుంది..! ఈ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..
ఇంజిన్ :
160cc సింగిల్ సిలిండర్ ఇంజన్ ను కలిగి ఉంది. 11 బిహెచ్‌పిల బ్రేక్ హార్స్ పవర్, 11.6 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ఫ్రెంట్ టెలిస్కోపిక్ పార్కులు వెనుక భాగంలో మోనో సస్పెన్షన్ సెటప్ కూడా ఉంది ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్స్ ఉన్నాయి ఇది స్టాండర్డ్ సింగిల్ ఛానల్ ఏబీఎస్ (ABS) తో పనిచేస్తాయి. ఈ స్కూటర్‌ను గ్లాసీ రెడ్ , గ్లాసీ వైట్, మ్యాటి బ్లూ, మ్యాటి బ్లాక్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇది సుజుకి బర్క్ మాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌కు ప్రత్యర్థిగా నిలుస్తుంది.
ఫీచర్లు:
ఇది మల్టీ ఫంక్షనల్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉంది . దీని ద్వారా ఆర్ పీ ఎమ్ మీటర్, యావరేజ్ స్పీడ్, మైలేజ్ ఇండికేటర్ వంటివి తెలుసుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ఫ్యూయల్ లెవెల్ ఇండికేటర్ కూడా ఉంది. ఈ స్కూటర్ లో కనెక్ట్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చింది. మ్యాక్సి స్కూటర్ డిజైన్ లాంగ్వేజి తో రూపొందించారు. ఏబిఎస్ – సిబిఎస్, క్రోమో ప్లేటెడ్ ఎగ్జాస్ట్, ఎల్ఈడి టెయిల్ లైట్స్ ,ఎల్ఈడి హెడ్ ల్యంప్, ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్, ఫ్రంట్ టైర్న్ సిగ్నల్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ , లార్జ్ సింగిల్ పిస్ సీటు వంటి ఫీచర్లతో ఆకర్షణీమైనా లుక్ ను కలిగి ఉంది. అండర్ స్ట్రీట్ స్టోరేజ్, 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?