NewsOrbit
న్యూస్ హెల్త్

పియానో నేర్చుకోవడం వలన పిల్లలకు ఇన్ని లాభాలు ఉంటాయి.

పియానో నేర్చుకోవడం వలన పిల్లలకు ఇన్ని లాభాలు ఉంటాయి.

పియానో ప్లే చెయ్యగలిగే సామర్థ్యం కలిగి ఉండటం ఒక అద్భుతమైన నైపుణ్యం. చిన్న వయస్సు నుంచే  పియానో వాయించే పిల్లలకు ఈ ప్రయోజనాలు ఉంటాయి. 

పియానో నేర్చుకోవడం వలన పిల్లలకు ఇన్ని లాభాలు ఉంటాయి.

1) పియానో వాయించడం లేదా నేర్చుకోవడం ఆత్మగౌరవాన్ని పెంచుతుంది:

ఒకప్పుడు కష్టతరమైనదాన్ని ఇప్పుడు పరిష్కరించగలగడం మరియు దాన్ని అధిగమించగలగడం పిల్లలకు  మరియు పెద్దలకు  ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. పియానో ప్లే చేసినప్పుడు కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఇచ్చే ప్రశంసలు పొందడం  వలన పిల్లలకు ఎంతో తృప్తిగా మరియు వారికి వారి పై విశ్వాసం పెరగడానికి సహాయపడతాయి. పెద్దవారి నుంచి అధిక ప్రశంసలు  అధిక స్థాయి సాధనతో ముడిపడి ఉంటుంది. కాబట్టి వారు పెరిగేకొద్దీ వేరువేరు నైపుణ్యాలను నేర్చుకుంటారు. 

2) పియానో పాఠాలు దృష్టి మరియు ఏకాగ్రతతో సహాయపడతాయి

దృష్టి మరియు ఏకాగ్రతను మెరుగుపర్చడానికి పియానో వాయించడం ఎంతగానో సహాయపడుతుంది. నిజానికి పియానో వాయించే నైపుణ్యం ఏకాగ్రతతో ద్యాస పెట్టి పనిచేసే సామర్ధ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఇది సవాలుగా మారినప్పుడు పిల్లలులోని సామర్ధ్యత బయటపడుతుంది. 

3) పియానో ప్లే చెయ్యడం సృజనాత్మక మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది

సంగీత వాయిద్యం నేర్చుకోవడం క్రియేటివిటీతో పాటు సమస్య పరిష్కార నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పియానో వాయించడం నేర్చుకున్న పిల్లలు వారి జీవితంలో తలెత్తే ఏ సమస్యలకు అయినా వారిక్రియేటివిటీతో పరిష్కారాలను కనుగొనడంలో మెరుగ్గా ఉంటారు. మిగతా పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు చాలా చురుకుగా ఉంటారు. .

4) పియానో ప్లే చెయ్యడం నేర్చుకోవడం స్కూల్స్ లో  సాధారణ పనితీరుకు కూడా సహాయపడుతుంది

పియానో వాయించడం మరియు నేర్చుకోవడం పాఠశాల కూడా సహాయపడుతుంది. సంగీత వాయిద్యం నేర్చుకోవదానికి మరియు గణితం లోని కొన్ని  సమస్యలకు మెదడులోని ఒక భాగాన్ని ఉపయోగించాలని దీని వలన మెదడుకు కూడా  వ్యాయామం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకుముందు అంశంలో చర్చించిన ఏకాగ్రత మరియు ధ్యాసను మెరుగుపరచడానికి అలాగే గణితం లో కూడా పియానో పాఠాలు ఉపయోగపడతాయి. 

5) పియానో పాఠాలు కమ్యూనికేషన్ మరియు పరిపక్వతను మెరుగుపరుస్తాయి

పియానో ట్యూటర్‌తో పిల్లలు కూర్చుని ఒకరు ఒకరితో మాట్లాడుకోవడం వలన వారి కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఈ ప్రక్రియలో పిల్లలు వినడం, ప్రశ్నలు అడగడం, ప్రతిస్పందించడం వంటి నైపుణ్యాలకు అలవాటుపడతారు. వారు వారి తల్లిదండ్రులతో లేదా కుటుంబ సభ్యులతో పోలిస్తే చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు. పిల్లలు ఈ ప్రక్రియలో పరిణితి చెంది వాళ్ళ తరగతి గది లో ఉండే మిగితా పిల్లల కంటే వీరు ఎక్కువ బాధ్యతగా, చురుకుగా, ఉంటున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లలు పరిణతి చెందడం వలన పెద్దలతో సంభాషించేడప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు. 

అయితే ఐక్యూ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిలతో పోలిస్తే భాషపై పట్టు సాధించడానికి పియానో నేర్చుకోవడం చాలా  ఉపయోగపడుతుందన్నారు నిపుణులు. ఈ అధ్యయన ఫలితాలను నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారి జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ఈ అధ్యయనం స్కూళ్లల్లో పిల్లలకు మ్యూజిక్ క్లాసులు నిర్వహించేలా ప్రోత్సహిస్తుందని వారు ఆశిస్తున్నారు. కాబట్టి మీరు కూడా  మీ పిల్లలను పియానో క్లాస్స్  లకు పంపించండి.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!