NewsOrbit
న్యూస్

Sidabad Rape Case: సైదాబాద్ హత్యాచార నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్..!!

Sidabad Rape Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సైదాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన ఆరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు మృతిపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజు మృతదేహాం రైల్వే ట్రాక్ పై లభ్యం అవ్వడంతో ఆతను పోలీసులకు, ప్రజలకు భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావించారు. మరో పక్క రాజు కుటుంబ సభ్యులు దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులే ఎన్ కౌంటర్ చేసి ఆత్మహత్యగా చూపుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో రాజుది ఆత్మహత్య కాదనీ, కస్టోడియల్ మృతిగా అనుమానం ఉందంటూ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ హైకోర్టులో లంచ్ మోషన్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ పై ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట తరువాత విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

PIL filed in Telangana high court about Saidabad Rape Case accused rajus murder
PIL filed in Telangana high court about Saidabad Rape Case accused rajus murder

ఈ నెల 9వ సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన తరువాత నిందితుడుగా ఉన్న రాజు కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు పది లక్షల రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు రాజు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరో పక్క ప్రముఖులు, సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఓ పక్క పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తుండగానే స్టేషన్ ఘన్ పూర్ సమీపంలో మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడు రాజు అన్ని వైపులా చుట్టుముట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు.  నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పోలీసులు ముందుగానే భావించి రైల్వే ట్రాక్ లపై గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు రైల్వే ట్రాక్ లపై మృతి చెందిన వారి వివరాలను ఆరా తీశారు. మార్చురీల్లో భద్రపర్చిన మృతదేహాలను పరిశీలించారు.

Read More:

1.AP SEC: జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎప్పుడంటే.. ?

2.TS News: జన జీవన స్రవంతిలోకి ఆ మహిళా మావోయిస్టు నేత..!!

3.Justice Kanagaraj: జస్టిస్ కనగరాజ్‌కు ఇచ్చిన రెండవ పదవీ పాయె..!!

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N