న్యూస్ హెల్త్

మొలలు వ్యాధి ఉన్నవారు తీసుకోవాలిసిన  జాగ్రత్తలు!!

Share

మలబద్ధకం ఉన్నవారికి మొలలు ఏర్పడే అవకాశంఎక్కువగా  ఉంది. మల విసర్జన సాఫీగా జరగకపోవడం అనేది  ఈ సమస్యకుప్రధాన కారణం గా చెప్పవచ్చు. మొలలు వ్యాధి ఉన్నవారు తీసుకోవాలిసిన కొన్ని  జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం… ద్రవపదార్థాలు ఎక్కువగా  తీసుకోవాలి. ప్రత్యేకించి నీళ్ళను బాగా తాగేలా చూసుకోవాలి. ఆహారం లోకి పాత బియ్యం, పాత గోధుమలు వాడుకోవాలి.

 • సగ్గుబియ్యం, బార్లీ జావలు  తీసుకుంటూ ఉండాలి .
 • బీరకాయ, పొట్లకాయ కూరలుఎక్కువగా తినవలిసి ఉంటుంది .
 • పెసరపప్పును మాత్రమే ఆహారం లో  తీసుకోవాలి. కందిపప్పు , మినపపప్పు తినకుండా ఉండడం మంచిది .
 • కోడి మాంసం, గుడ్డు చేప , రొయ్యలు అసలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఎప్పుడైనా ఒకసారి మేక మాంసం అది కూడా తక్కువ మోతాదు లో మసాలా తక్కువ వేసి తినవచ్చు.
 • పళ్ల రసాలు తాగాలి. ముఖ్యంగా యాపిల్ రసం ఎక్కువగా తీసుకోవాలి .
 • పాలకూర, పెరుగుతోటకూర, మెంతికూర, గంగపాయల కూర వంటి ఆకుకూరల ఎక్కువసార్లు తీసుకుంటూ ఉండాలి.
 • ఆహారం లో పాతపచ్చళ్ళు వేసుకోవడం  పూర్తిగా ఆపేయాలి.
 • ఎక్కువసేపు ప్రయాణాలు చేయకుండా ఉండడం ఉత్తమం .
 • గట్టిగా  ఉండే చెక్క కుర్చీల పైన ఎక్కువ సమయం కూర్చోకూడదు. అలాని స్పాంజితో చేసిన వాటిమీద కూడా కూర్చోకూడదు. బూరుగు దూది తో  లేదా పత్తితో చేసినవి ఉపయోగించాలి .
 • మలబద్దకం లేకుండా సుఖవిరేచనం అయ్యేలాజాగ్రత్తలు తీసుకోవాలి .
 • శరీరానికి వేడిచేసే పదార్థాల కువీలయినంత దూరంగా ఉండడంతో పాటు మజ్జిగ ఎక్కువ తాగాలి .
 • కొత్త చింతపండు , కొత్త బెల్లం కూడా తీసుకోక పోవడం మంచిది.
 • ఆహారం లో  నువ్వులు , ఆవాలు , నువ్వు చెక్క వాడకుండా ఉండడం మంచిది.
 • ఆహారంలో నూనెతక్కువగా ఉండేలా చూసుకోవాలి.
 • చద్దన్నం, చల్లబడినవి , మెత్తపడిన తినకూడదు.
 • ఎలాంటి పరిస్థితుల్లోనూ బచ్చలి,వంకాయ , గోంగూర, సొరకాయ, మొలల సమస్య ఉన్నవారు తినరాదు.
 • మొలల సమస్యతో బాధ పడుతున్నవారు శరీరంలో వేడి,వాతం  పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ సరైనవైద్యుడుని సంప్రదించి చికిత్స పొందాలి .


Share

Related posts

బిగ్ బాస్ 4 : లాస్ట్ మినిట్ లో ట్విస్ట్..? అభిజిత్ కాదని తనకు వెళ్లనున్న టైటిల్..? కారణం ఇదే…!

arun kanna

Radhe Shyam : విదేశాల్లో రికార్డులు సృష్టిస్తున్న ‘రాధేశ్యామ్’!

Ram

David Warner : చిరంజీవి ని సైతం వదిలిపెట్టని డేవిడ్ వార్నర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar