NewsOrbit
న్యూస్

‘గులాబీ ఎమ్మెల్యే’ గుండాయిజం! మానవ హక్కుల సంఘానికి మహిళ మొర

అక్కడ ఇక్కడ అని కాదు ఎక్కడైనా ఎమ్మెల్యేల పోకడలు ఇలాగే ఉంటాయా అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

గురువారం ఈ తరహా సంఘటనలు రెండు జరిగాయి. ఒకటేమో ఆంధ్రప్రదేశ్లో జరుగగా మరొకటి తెలంగాణ లో చోటుచేసుకుంది. తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తి ఇందుకు తాను అడ్డుపడడంతో గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ శాసన సభ్యుడు అంబటి రాంబాబు పేరుతో తనను బెదిరిస్తున్నారని హనుమ ప్రసాద్ అనే వ్యాపారి పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేశారు. ఇక తెలంగాణలో ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే పై మహిళ నేరుగా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు అందజేసింది. తన కుటుంబాన్ని ఆ శాసనసభ్యుడు టార్గెట్ చేసుకొని వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆమె ఫిర్యాదు చేయగా హక్కుల సంఘం కేసు నమోదు చేసింది.

 

విషయానికొస్తే తెలంగాణ అధికారపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు వివాదంలో చిక్కుకున్నారు.తమ కుటుంబాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులకు గురి చేస్తున్నట్లుగా ఒక మహిళ రాష్ట్ర మానవహక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేయటం కలకలాన్ని రేపింది.మిర్యాలగూడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు తమ కుటుంబాన్ని వేధిస్తున్నట్లుగా మణెమ్మ అనే మహిళ కంప్లైంట్ చేశారు. మిర్యాలగూడలో కొందరు భూకబ్జాదారులు చెలరేగిపోతున్నట్లుగా ఆమె చెప్పారు. వారికి ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారన్నారు.

తన భర్త లాయర్ గా పని చేస్తుంటారని.. ఎమ్మెల్యే బాధితుల తరఫున కేసులు వాదిస్తుండటంతో కక్ష కట్టినట్లుగా పేర్కొన్నారుతన భర్తపై అక్రమ కేసులు పెడుతున్నారని.. ఎమ్మెల్యే అక్రమాలను ప్రశ్నించటంతో తన భర్తను.. కొడుకును.. ఇతర కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపించారు. ఎమ్మెల్యే నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘాన్ని ఆమె కోరారు. అయితే.. ఈ ఆరోపణల్ని ఎమ్మెల్యే భాస్కరరావు ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులు తన మీద బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఇంత జరిగినా టిఆర్ఎస్ అధిష్టానవర్గం ఈ విషయమై ఏ విధమైన వ్యాఖ్యలు చేయలేదు. మరి హక్కుల సంఘం ఏ విధంగా ఆ మహిళకి న్యాయం చేస్తుందో చూడాలి! ఏదేమైనా ఎమ్మెల్యేలు ప్రజా రక్షకులుగా ఉండాలి తప్ప భక్షకులు కారాదు సుమా!

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju