పీకే టీమ్ వస్తుంది: మీ నియోజకవర్గంలో ఎప్పుడంటే..!? నాలుగు అంశాల్లో కీలక సర్వే..!

Share

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు పొలిటికల్ సీజన్ ను మొదలు పెట్టేశాయి. అంటే రానున్న ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు మానసికంగా ప్రెపేర్ అయిపోవడంతో పాటు నాయకులను సంసిద్దులను చేయడం. ఇతర పార్టీలకంటే అధికార వైసీపీ ఈ విషయంలో మూడు అడుగుల ముందే ఉంది. వచ్చే ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వడంలో వైసీపీ ముందంజలో ఉంది. ఈ ఏడాది మార్చి నుండి ప్రశాంత్ కిషోర్ (పీకే) టీమ్ ను వైసీపీ దింపింది.  అలాగే ఢిల్లీకి చెందిన ఓ ప్రైవేటు ఏజన్సీని కూడా దింపి వైసీపీ సర్వేలు చేయించుకుంటోంది. అంతే కాకుండా రాష్ట్రానికి సంబంధించి ఓ సంస్థతో కూడా సర్వే చేయిస్తున్నారుట. ఈ మూడు రకాల సర్వేలతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా, సాక్షి మీడియా ద్వారా మొత్తం అయిదు రకాలుగా సర్వేలు చేయించుకుంటోంది. సీఎం జగన్మోహనరెడ్డి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు.

వివిధ ఏజన్సీల ద్వారా అభిప్రాయ సేకరణ

ఎమ్మెల్యేల పనితీరు, తన పై ఉన్న అసంతృప్తి, సంతృప్తి విషయాలు, మంత్రుల పనితీరు, నాయకుల పనితీరు, కార్యకర్తల అభిప్రాయాలు, పరిపాలన తీరు ఇలా రకరకాల యాంగిల్స్ లో రిపోర్టులను జగన్ తెప్పించుకుంటున్నారు. మరో పక్క టీడీపీ, జనసేన పార్టీలు కూడా వారి వారి ఏజన్సీల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. టీడీపీ ఇప్పటికే ఇద్దరు రాజకీయ స్ట్రాటజిస్ట్ లను పెట్టుకుంది. జనసేన పార్టీ ఇంత వరకూ స్ట్రాటజిస్ట్ ల మీద ఆధారపడలేదు కానీ వాళ్లు ఒక ప్లాన్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్రకు రెడి అయ్యే ముందు ఒక ప్లాన్ తో ఉన్నారు. ప్రస్తుతం పీకే (ప్రశాంత్ కిషోర్) టీమ్ ఏమి చేస్తుంది..? అనే విషయాలను పరిశీలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల పని తీరు ఎలా ఉంది ? వాలంటీర్ల పని తీరు ఎలా ఉంది ? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది ? అనే ఈ మూడు అంశాలతో పాటు ఎమ్మెల్యేల పనీతీరు, అధికారుల పని తీరు మీద ఈ టీమ్ అధ్యయనం చేస్తొంది. ఓవరాల్ గా ప్రభుత్వ పని తీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా..? అసంతృప్తిగా ఉన్నారా..? అనే విషయాలపై అభిప్రాయ సేకరణ చేస్తొంది పీకే టీమ్.

 

40 నియోజకవర్గాల్లో పీకే టీమ్

గత 20 రోజుల నుండి అంటే జూలై మొదటి వారం నుండి ఈ పనిలో పీకే టీమ్ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 30 – 40 నియోజకవర్గాల్లో ఈ అభిప్రాయ సేకరణ జరుగుతోంది. చీరాల, పర్చూరు, దెందులూరు, గోపాలపురం, నిడదవోలు, విశాఖపట్నం టౌన్ తదితర జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణలో పీకే టీమ్ వర్క్ చేస్తొంది. ఒక్కో నియోజకవర్గంలో రెండు మూడు బృందాలుగా విడిపోయి పై అంశాలపై ప్రజల నుండి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదికను ఆగస్టు నెలాఖరు నాటికి జగన్మోహనరెడ్డికి అందించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరుపై నివేదిక సీఎం జగన్మోహనరెడ్డికి అందనుంది.

ఏబీఎన్ ఆర్కే సెన్పేషన్: జగన్ ఓటమి ఖాయం..!? పీకే ఎం చెప్పారు .. ఆర్కే ఏం రాశారు..!?


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

54 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

1 hour ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

4 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

4 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

5 hours ago