Munnar : మున్నార్ వెళ్తే ఈ ప్రదేశాలను తప్పకుండా చూడండి !!(పార్ట్1)

Share

Munnar : మున్నార్‌ చాలామంది  కి పరిచయం చేయనవసరం లేని ప్రదేశం అనే చెప్పాలి…అయితే తెలియని వారికోసం ఈ వివరాలు.  కేర‌ళ‌లో చాలా పర్యాటక స్థలాలు ఉంటాయి వాటిలో ఒక  ముఖ్య‌మైన ప‌ర్యాటక ప్రదేశం గా మున్నార్‌ ని చెప్తారు . ఎప్పుడూ ప‌చ్చ‌ని ప్ర‌కృతి అందాల‌తో శోభిస్తుంటుంది. ఎటు చూసినా ప‌చ్చ‌ని చెట్లతో , ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం తో , కొండ చ‌రియ‌ల తో .. ప‌ర్యాట‌కుల‌కు మ‌ధుర‌మైన అనుభూతుల‌ను అందిస్తుంటాయి. కేర‌ళ రాజ‌ధాని అయినా  కొచ్చికి 130 కిలోమీట‌ర్ల దూరం లో మున్నార్ ఉంది. అక్కడకు  చేరుకున్న ప‌ర్యాట‌క ప్రేమికులు మున్నార్‌లో చూడ‌ద‌గిన అందాలు, ఆస్వాదించ‌ద‌గిన అద్భుతాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Places to visit in Munnar Part 1
Places to visit in Munnar Part 1

కేర‌ళ‌కు చెందిన సంప్ర‌దాయ నృత్యా ల్లో క‌థ‌క‌ళి కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నైపుణ్యం ఉన్న క‌ళాకారులు ప్ర‌దర్శించే ఆ నృత్యాన్ని క‌చ్చితంగా ప‌ర్యాట‌కులు చూసితీరవలిసిందే. వారు ఇచ్చే లైవ్ ప్ర‌ద‌ర్శ‌న‌లు ప‌ర్యాట‌కులు చూపుతిప్పుకోకుండా చేస్తాయి .అవి తప్పకుండా చూసి తీరవలిసిందే.

మున్నార్‌ను సంద‌ర్శించే ప‌ర్యాట‌కులు చాలా మంది అక్కడ వుండే  మౌంటేన్ బైకింగ్‌ను బాగా ఆస్వాదిస్తారు. ప‌చ్చ‌ని ప‌ర్వ‌తాల‌పై బైకింగ్ చేస్తేపొందే అనుభూతి మాటలలో చెప్పడం కష్టం. సాహిసికులు ఎక్కువ‌గా మున్నార్‌లో మౌంటేన్ బైకింగ్ అడ్వెంచ‌ర్ చేసేందుకు ఎక్కువగా ఆస‌క్తి చూపిస్తుంటారు. క‌నుక మీరు కూడా ఎప్పుడైనా మున్నార్ వెళితే.. త‌ప్ప‌క ఈ సాహ‌సాన్ని ట్రై చేయండి.చాల అంటే చాల బావుంటుంది.. అనుభవించి తీరవలిసిందే.

సహజం గా ప‌చ్చ‌ని ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌కృతి వాతావ‌ర‌ణం లో గ‌డిపితే అన్ని ఆందోళ‌న‌లు తగ్గిపోతాయి. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. కాబట్టి  మున్నార్ ప‌ర్యాట‌కుల‌కు ఆయుర్వేద స్పాలు స్వాగతం ప‌లుకుతుంటాయి. చెప్పాలంటే ఒక్కసారి అయినా అక్కడ స్పా కి వెళ్లి తీరవలిసిందే..

 


Share

Related posts

గాజువాక మీద పవన్ కి మోజు తగ్గలేదా?

Yandamuri

Lokesh kanagaraj : శంకర్ కంటే ముందు చరణ్‌ని డైరెక్ట్ చేయబోతున్న కోలీవుడ్ డైరెక్టర్..?

GRK

గుడ్ న్యూస్.. ‘ఫింగర్ ప్రింట్’తో క్యాష్ విత్ డ్రా..!

Teja