NewsOrbit
న్యూస్

రైనా.. ప్లీజ్ వ‌చ్చేయ్‌.. ట్విట్ట‌ర్‌లో కోరుతున్న అభిమానులు..!

ఈసారి ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ టీంకు అస‌లు ఏదీ క‌ల‌సి రావ‌డం లేదు. ఆదిలోనే హంస‌పాదులా టీంలో చాలా మంది మొద‌ట్లో క‌రోనా బారిన ప‌డ్డారు. త‌రువాత సురేష్ రైనా, హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఈ టోర్నీ మొత్తానికీ దూర‌మ‌య్యారు. దీంతో చెన్నై టీంకు ఎదురు దెబ్బ‌లు త‌గిలాయి. ఇక టోర్నీ ఆరంభంలో ముంబైపై గెలిచినా త‌రువాత జ‌రిగిన రెండు మ్యాచ్‌లోనూ వ‌రుస‌గా ఓడిపోవ‌డంతో అభిమానులంద‌రూ ఇప్పుడు సురేష్ రైనా వైపు చూస్తున్నారు. రైనాను తిరిగి ఐపీఎల్‌కు రావాల‌ని, చెన్నై టీంను విజ‌యాల బాట ప‌ట్టించాల‌ని కోరుతున్నారు.

please raina come back fans trending him in twitter

చెన్నై, ఢిల్లీ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన తాజా మ్యాచ్‌లో చెన్నై ఘోర ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెలిసిందే. అంత‌కు ముందు మ్యాచ్‌లోనూ రాజ‌స్థాన్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. టీంలో బ్యాటింగ్ వైఫ‌ల్యం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఓపెన‌ర్లు ముర‌ళీ విజ‌య్‌, షేన్ వాట్సన్‌లు పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నారు. దీంతో మిడిలార్డ‌ర్‌పై భారం ప‌డుతోంది. మ‌రో బ్యాట్స్‌మ‌న్ డుప్లెసిస్ త‌న శ‌క్తిమేర పోరాడుతున్నా ఇత‌ర ప్లేయ‌ర్ల నుంచి అత‌నికి స‌పోర్ట్ ల‌భించడం లేదు. ఈ క్ర‌మంలో ఆఖ‌రి ఓవ‌ర్ల‌లో ధోనీ వ‌చ్చినా చేయాల్సిన ప‌రుగుల సంఖ్య భారీగా ఉంటోంది. దీంతో స‌హ‌జంగానే వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లలోనూ చెన్నై టీం విఫ‌ల‌మైంది. అందుకు బ్యాట్స్‌మెన్ వైఫ‌ల్య‌మే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని మ‌న‌కు స్ఫ‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. దీంతో జ‌ట్టులో సురేష్ రైనా లేని లోటు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంద‌ని అభిమానులు అంటున్నారు.

https://twitter.com/spardeshi793/status/1309584840266665984?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1309584840266665984%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.thequint.com%2Fsports%2Fsports-buzz%2Fsuresh-raina-trends-on-twitter-after-csk-lose-to-delhi-capitals

సురేష్ రైనా నిజానికి అద్భుత‌మైన ఆట‌గాడు. అనేక సార్లు చెన్నైని విజ‌యాల బాట ప‌ట్టించాడు. నంబ‌ర్ 3 స్థానంలో రైనా వ‌స్తే క్రీజులో పాతుకుపోతే అంతే.. చెన్నై క‌చ్చితంగా విజ‌యం సాధిస్తుంది. స‌రిగ్గా చెన్నైకి కూడా ఇప్పుడు కావ‌ల్సింది అదే. అందుక‌నే అత‌న్ని తిరిగి రావాల‌ని అభిమానులు కోరుతున్నారు. రైనా ప్లీజ్ క‌మ్ బ్యాక్ అంటూ అభిమానులు ట్విట్ట‌ర్‌లో అత‌న్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇక చెన్నై త‌దుప‌రి మ్యాచ్ అక్టోబ‌ర్ 2న స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో ఆడ‌నుంది. క‌నుక రైనా ఇప్పుడే వ‌స్తే క్వారంటైన్ ముగించుకుని ఆ మ్యాచ్ వ‌ర‌కు అందుబాటులో ఉండ‌వ‌చ్చ‌ని అభిమానులు కోరుతున్నారు. మరి రైనా ఏం చేస్తాడో చూడాలి.

author avatar
Srikanth A

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju