PM Kisan: రైతులకు బాసటగా నిలుస్తోంది మన కేంద్ర ప్రభుత్వం. PM కిసాన్ పేరిట కొన్ని వేల కోట్లు రైతులకు కేటాయించింది కేంద్రం. PM కిసాన్ 10వ విడత డబ్బులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది రైతుల ఖాతాలకు ఏడాదికి రూ. 6 వేలు బదిలీ చేస్తోన్న విషయం తెలిసినదే కదా. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ సౌకర్యాన్ని అర్హత ఉండి, వినియోగించుకోలేకపోతున్న రైతులు అనేకమంది వున్నారు. ఒకవేళ మీరు కూడా ఆ లిస్టులో ఉన్నట్టయితే 11వ విడత డబ్బులు కోసం మీరు వెంటనే ఇలా చేయండి.
PM Kisan: PM కిసాన్ యోజన 11వ విడత అప్పుడే రానుంది..
PM కిసాన్ యోజన 11వ విడత డబ్బులు ఏప్రిల్ మొదటి వారంలో రైతులకు అందనున్నాయి. ఈ పథకంలో నమోదు చేసుకోవడం చాలా తేలికైన విషయం. ఆన్లైన్లో ఇంట్లో కూర్చొనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. అలా కానీ యెడల పంచాయతీ కార్యదర్శి లేదా పట్వారీ లేదా స్థానిక కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా దరఖాస్తు చేసుకొనే వీలుంది. ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి అక్కడ ‘న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్’ ఎంపికపై క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఆధార్ నంబర్‌ను నమోదు చేసిన తరువాత క్యాప్చా కోడ్‌ను నమోదు చేయడం ద్వారా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి.
Singer Sunitha: భర్త రామ్ ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన ఓ నెటిజన్.. చెంప పగిలేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత!
ఇంకా ఇలా చేయండి..
తరువాత సదరు ఫారమ్‌లో మన వ్యక్తిగత సమాచారాన్ని అందించాలి. దీనితోపాటు ఖాతా వివరాలు, పొలానికి సంబంధించిన సమాచారం కూడా నివేదించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద 2 హెక్టార్లు అంటే 5 ఎకరాలు సాగుచేసే రైతులు మాత్రమే ఈ ప్రయోజనం పొందుతారు. ఆపై కూడా మీకు రావాల్సిన వాయిదా డబ్బు రాకపోతే, ఈ నెంబర్లను సంప్రదించవచ్చు. PM కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266. PM కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261, 011-24300606, 0120-6025109. PM కిసాన్ ల్యాండ్‌లైన్ నంబర్: 011-23381092, 23382401.