ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోదరుడు ప్రహ్లాద్ మోడీ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ప్రహ్లాద్ మోడీ, ఇతర కుటుంబ సభ్యులు ఎస్ యూవీ వాహనంలో బండిపూర వెళుతుండగా మైసూర్ కు 13 కిలో మీటర్ల దూరంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ కు ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం సుజ్జునుజ్జు అయ్యింది. ఈ కారులో ప్రహాద్ మోడీ సహా కుమారుడు, కోడలు, మనవడు ఉన్నారు. ఈ ప్రమాదం కారణంగా వీరు స్వల్పంగా గాయపడగా వీరు మైసూర్ లోని జేఎస్ హాస్పటల్ లో చెేరి చికిత్స పొందుతున్నారు. స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయనీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

ప్రహ్లాద్ మోడీ కారు ప్రమాదానికి గురైన విషయం తెలియడంతో బీజేపీ నాయకులు ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్రేన్ సహాయంతో కారును తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఏపి మంత్రి విడదల రజనికి హైకోర్టు నోటీసులు
