NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: అబుదాబీలో తొలి హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబీ సమీపంలో నిర్మించిన హిందూ ఆలయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన యూఏఈ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భోచాసనవాసీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఆలయాన్ని ప్రారంభించారు.

ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. హింధూ దేవతలకు హారతి ఇచ్చారు. ఆలయ ప్రారంభానికి విచ్చేసిన ప్రధాని మోడీని చూసేందుకు భారత పౌరులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారికి అభివాదం తెలియజేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ ఈ కార్యక్రమానికి హజరైయ్యారు.

దుబాయ్ – అబుదాబీ మార్గంలోని షేక్ జాయెద్ హైవే పక్కన ఈ ఆలయాన్ని నిర్మించారు. 2014 లో మోడీ తొలి సారి ప్రధాని పదవి చేపట్టిన కొద్ది కాలానికే ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది. 2015 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ తో ప్రధాని మోడీ పలు అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఈఏ సర్కార్ నిర్ణయం తీసుకోవడమే కాక 13.5 ఎకరాల భూమి కేటాయించింది. అనంతరం మత సహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో 13.5 ఎకరాలు ప్రకటించింది.

అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది. 2018 లో మోడీ తన రెండో యూఈఏ పర్యటన సందర్భంగా బాప్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపెరా హౌజ్ నుండి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. 2019 లో నిర్మాణ పనులు ప్రారంభించగా.. రాజస్థాన్, గుజరాత్ ల  నుండి వచ్చిన నిపుములు దాదాపు మూడేళ్లు శ్రమంచి ఈ అధ్బుత కట్టడంలో భాగస్వాములయ్యారు. దుబాయ్ లో మరో మూడు హిందూ ఆలయాలు ఉన్నా ప్రధాని మోడీ ప్రారంభించిన అబుదాబీ మందిరం గల్ఫ్ ప్రాంతంలో కెల్లా అతి పెద్దది.

అరబ్ ఎమిరేట్స్ లోని ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఈ ఆలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. రాజస్థాన్ నుండి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆలయానికి రెండు వైపులా భారత్ నుంచి భారీ కంటైనర్లలో తీసుకువచ్చిన పవిత్ర గంగా, యమునా నదీ జలాలు ప్రవాహాన్ని ఏర్పాటు చేశారు. ఇది వారణాసి ఘాట్లను తలపించేలా ఉంది.

Congress: తెలంగాణ రాజ్యసభ అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్ ..ఈ ఇద్దరికి జాక్ పాట్

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N