NewsOrbit
న్యూస్

5 జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ

భారత్ లో 5 జీ సేవలు శనివారం మొదలైయ్యాయి. నాల్గవ పారిశ్రామిక విప్లవంగా భావిస్తున్న 5 జీ సేవలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుండి దేశంలోని ప్రధాన నగరాల్లో 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరో విడత ఇండియా ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) లో కార్యక్రమం జరుగుతున్న ఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఈ నెల 4వ తేదీ వరకూ కొనసాగుతుంది. ఈ ఎగ్జిబిషన్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం (డాట్), సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

PM Modi

 

ప్రస్తుతం నిర్దేశిత నగారాల్లోనే 5 జీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి, వచ్చే రెండు సంవత్సరాల్లో మొత్తం దేశ వ్యాపితంగా 5 జీ సేవలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి. రియలన్స్ జీయో, ఎయిర్ టెల్, వీఐ ద్వారా 5 జీ సేవలు ఢిల్లీ, ముంబై సహా ఏడు నగరాల్లో అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. అయితే అందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. రియలన్స్ జీయో ఇప్పటికే జీయో 5 జీ సర్వీసును దశవారిగా అందించాలని తమ వార్షిక సర్వసభ్య సమావేశంలో నిర్ణయించింది. ఈ దీపావళి నాటికి నాలుగు ప్రధాన నగరాలైన ఢిల్లీ,. కోల్ కతా, చెనై, ముంబై లో 5 జీ సేవలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

PM Modi

 

తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎగ్జిబిషన్ లోని స్టాల్స్ ను పరిశీలించారు. అక్కడి స్టాళ్లలో కలియతిరిగారు. జీయో, ఎయిర్ టెల్, సహా పలు సంస్థల 5 జీ ఉత్పత్తులను వీక్షించారు. ఆయా కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల గురించి మోడీకి వివరించారు. ప్రత్యేక కళ్లద్దాలు ధరించి వీడియోలు వీక్షించారు. ఓ స్టాల్ లో వీడియో గేమ్ సైతం ఆడారు మోడీ.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju