NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

నిరుద్యోగులకు పీఎం మోడీ దీపావళి ధమాఖా.. 75వేల మందికి నియామక పత్రాలు అందజేత

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశంలోని వేలాది మంది నిరుద్యోగ యువతకు దీపావళి గిఫ్ట్ అందించారు. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగం పొందిన 75వేల మందికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందించారు ప్రధాని మోడీ. ఈ సందర్భంగా శనివారం పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే రోజ్ గార్ మేళా రిక్రూట్ మెంట్ డ్రైవ్ ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ యువత కోసం అత్యధిక ఉద్యోగాలను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తొందన్నారు. కోవిడ్ అనంతరం ప్రపంచ దేశాల పరిస్థితులు అంత బాగా ఏమీ లేవని అన్నారు. చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం సమస్య శిఖర స్థాయిలో ఉందని చెప్పారు. వందేళ్లకు ఒక సారి వచ్చే మహమ్మారి ప్రభావం వంద రోజుల్లో అంతం కాబోదని అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు మన దేశంపైనా ఏ విధంగా ఉందో వివరించారు.

PM Modi

 

ప్రపంచ మంతా ఎదుర్కొంటున్న ఈ సంక్షోభ ప్రభావం అన్ని దేశాలపై ఉంటోందని పీఎం మోడీ అన్నారు. అయితే ఈ సమస్య ప్రభావం పడకుండా మన దేశాన్ని కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం అనేక నూతన చర్యలను చేపడుతోందని చెప్పారు. ఈ క్రమంలో కొన్ని రిస్క్ లను కూడా చేస్తొందని తెలిపారు. మన దేశంపై ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఇది సవాళ్లతో కూడుకున్న వ్యవహారమని, ప్రజల ఆశీర్వాదంతో మనం ఇప్పటికీ సురక్షితంగా ఉన్నామని పీఎం మోడీ పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్ విభాగంలో 75 మందికి నియామక పత్రాలు పంపిణీ చేసిన మోడీ.. భారత ప్రభుత్వంలోని 38 మంత్రిత్వ శాఖలు, డిపార్ట్ మెంట్ లలో వీరు పని చేస్తారని చెప్పారు, దేశంలోని అన్ని ప్రాంతాల వారు ఈ ఉద్యోగాలకు ఎంపికైయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju