NewsOrbit
జాతీయం న్యూస్

PM Modi: ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోడీ కీలక సందేశం..జనవరి నుండి బూస్టర్ డోస్ వ్యాక్సిన్..

PM Modi: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. శనివారం రాత్రి ఆకస్మికంగా మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. జనవరి 3వ తేదీ నుండి 15 – 18 ఏళ్ల వయసు యువతీ యువకులకు వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అదే విధంగా జనవరి 10వ తేదీ నుండి హెల్త్ కేర్, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ అందిస్తామని ప్రకటించిన ప్రధాన మంత్రి మోడీ 60 సంవత్సరాలు పైబడి అనారోగ్య సమస్యలతో ఉన్న వారికి వైద్యుల సలహా మేరకు అదనపు డోస్ పంపిణీ చేస్తామని చెప్పారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు దేశంలో 90 శాతం వయోజనులకు కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు పంపిణీ పూర్తి అయ్యిందన్నారు.

PM Modi speech on omicron
PM Modi speech on omicron

 

PM Modi: ఔషదాలకు ఎలాంటి కొరత లేదు

ఒమిక్రాన్ పై రకరకాల వార్తలు, వదంతులు వస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ తయారీ, పంపిణీ కోసం నిరంతరం పని చేస్తున్నామన్నారు. ఆరోగ్య కార్యకర్తలు అంకితభావం వల్లనే వ్యాక్సిన్ పంపిణీ వడివడిగా సాగుతోందన్నారు. రానున్న రోజుల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేస్తామని పీఎం మోడీ అన్నారు. దేశంలో కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదనీ, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒమిక్రాన్ పై భయాందోళనలకు గురి కావద్దని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఔషదాలకు ఎలాంటి కొరత లేదని చెప్పారు. నేడు దేశంలో 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సిజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.4 లక్షల ఐసీయుూ బెడ్స్, చిన్నారులకు 90వేల ప్రత్యకే పడకలు సిద్దంగా ఉన్నాయన్నారు. అంతే కాకుండా మూడు లక్షలకు పైగా పీఎస్ఏ ఆక్జిన్ ప్లాంట్లు, నాలుగు లక్షల ఆక్సిజన్ సిసిండర్లు అన్ని రాష్ట్రాలకు సమకూర్చినట్లు వెల్లడించారు. ఒమిక్రాన్ నివారణకు వ్యాక్సిన్, జాగ్రత్తలే మందు అని అన్నారు. అనేక రాష్ట్రాల్లో నూరు శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయ్యిందని చెప్పారు. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యం కొనసాగుతోందని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju