NewsOrbit
న్యూస్

సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు సమయాలు, టికెట్ చార్జి వివరాలు ఇలా..

విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఆదివారం నాడు సంక్రాంతి కానుకగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. వర్చువల్ గా ఆయన జెండా ఊపి ప్రారంభించడంతో ట్రైన్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి విశాఖకు బయలుదేరింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సికింద్రాబాద్ లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ రైల్వే శాఖ ప్రతి సంవత్సరం ప్రయాణీకుల సౌకర్యం కోసం మూడువేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తొందని చెప్పారు. మారుతున్న దేశ భవిష్యత్తు కు వందే భారత్ రైలు ఒక ఉదాహరణ మాత్రమేనని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలందరికీ వందే భారత్ ట్రైన్ సంక్రాంతి కానుక అని అన్నారు. వందే భారత్ రైలు వేగంగా ప్రయాణీకులను తమ గమస్థానాలకు చేరుస్తుందన్నారు.

PM Modi virtually flags off Secunderabad Visakhapatnam vande bharat express train

 

సికింద్రాబాద్ – విశాఖల మద్య ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రధాని మోడి అన్నారు. ఎనిమిదేళ్లలో తమ ప్రభుత్వం రైల్వే కు అత్యధిక ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. వందే భారత్ రైలు ప్రజలుకు భద్రతతో పాటు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. 2023లో ప్రారంభించిన తొలి వందే భారత్ రైలు ఇది అన్నారు. తక్కువ కాలంలో ఏడు వందే భారత్ ట్రైన్ లను ప్రారంభించినట్లు చెప్పారు. త్వరలో 24 పట్టణాల్లో కొత్త మెట్రో రైళ్లు ప్రారంభం అవుతాయని తెలిపారు. తెలంగాణలో గడచిన ఏనిమిదేళ్లలో అద్భుతమైన పనులు చేశామన్నారు. గతంలో రూ.250 కోట్లు పనులు చేస్తే ఇప్పుడు రూ.3వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. మెదక్ సహా అనేక ప్రాంతాలకు రైల్వే వ్యవస్థతో కనెక్ట్ చేశామన్నారు. తెలంగాణలో రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ మూడింతలు పెంచామని తెలిపారు. ఏపిలో రైల్వే నెట్ వర్క్ ను పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఏపిలో ప్రతి ఏటా 220 కిలో మీటర్ల రైల్వే ట్రాక్ విద్యుద్దీకరణ చేస్తున్నట్లు తెలిపారు. 350 కిలో మీటర్ల కొత్త రైల్వే లైన్ ను ఏపిలో ఏర్పాటు చేశామని చెప్పారు.

సికింద్రాబాద్ – విశాఖ మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు వారంలో ఆరు రోజుల పాటు సేవలు అందిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ నుండి విశాఖ మధ్య ప్రయాణ సమయం 8.30 గంటలు కాగా చార్జీ రూ.1665లు టికెట్ చార్జీగా నిర్ణయించారు. సికింద్రాబాద్ నుండి వరంగల్లుకు రూ.520లు, ఖమ్మం కు రూ.750లు, విజయవాడకు రూ.905లు, రాజమండ్రికి రూ.1365లు చార్జిగా నిర్ణయించారు. విశాఖ నుండి రాజమండ్రికి రూ.625లు, విజయవాడకు రూ.960లు, ఖమ్మంకు రూ.1115లు, వరంగల్లుకు రూ.1310లు చార్జీగా వసూలు చేస్తున్నారు. విశాఖ నుండి ప్రతి రోజు ఉదయం 5.45 గంటలకు వందే భారత్ రైలు ప్రారంభమై మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి 11.30 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. ఈ వందే భారత్ రైలుకు ప్రయాణీకుల నుండి మంచి స్పందన కనబడుతోంది. శనివారం నుండి రిజర్వేషన్ ను అధికారులు ప్రారంభించగా, మంగళ,బుధవారం వరకే వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని అధికారులు తెలిపారు.

Breaking: నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం .. 40 మందికి పైగా మృతి.. విమానంలో అయిదుగురు భారతీయులు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?