18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఆర్ఆర్ఆర్ సినిమాకి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై చిత్ర యూనిట్ కి మోడీ ప్రశంసలు..

Pm Modi Wishes RRR team
Share

RRR: టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది. తాజాగా ఈ సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కైవసం చేసుకుంది. అది కూడా టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి.. ఓ ఇండియన్ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కడం ఇదే తొలిసారి.. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ అవార్డును గెలుచుకోవడం పై ఇప్పటికే పలువురు ప్రముఖులు చిత్ర యూనిట్ కు అభినందనలు తెలియజేశారు. తాజాగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆర్ఆర్ఆర్ టీం ను ప్రశంసించారు.

Pm Modi Wishes RRR team
Pm Modi Wishes RRR team

మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ను ప్రశంసించ్చారు . ఇది ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సందర్భంగా కీరవాణి రీ ట్వీట్ చేస్తూ.. ఈ అవార్డు స్వీకరించడంతో పాటు మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ఎంతో కృతజ్ఞతుడిని అంటూ ట్వీట్ చేశారు. నాటు నాటు పాటలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్పులు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ అవార్డు కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి సహా ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ లోని కొంతమంది కీలక సభ్యులు హాజరయ్యారు. ఇక నాటు నాటు ఒరిజినల్ విభాగంలో కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు.

ఈ అవార్డు రావడంపై పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆర్ఆర్ఆర్ టీమ్‌కు బెస్ట్ విషెస్ తెలిపారు. అటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు ప్రశంసలు అందుకున్నారు.గోల్డెన్ గ్లోబ్ అవార్డులు-2023 కార్యక్రమం ప్రస్తుతం కాలిఫోర్నియాలో జరుగుతోంది. ఈ సందర్భంగా RRR మూవీ రెండు నామినేషన్‌లతో ఈ అవార్డుల్లో చోటు సంపాదించింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ మూవీ కేటగిరీల్లో ఈ మూవీ నామినేట్ కాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును కీరవాణి అందుకోగానే.. ఒక్కసారిగా అక్కడ ఉన్న ఆర్ఆర్ఆర్ టీం అంతా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకుంది. ఎన్టీఆర్, రాజమౌళి,రామ్ చరణ్, కీరవాణి, తమ భార్యలతో కలిసి ఈ వేడుకకు వెళ్లారు. దీంతో ఒక్కసారిగా ఆ ఫంక్షన్‌లో ఆర్ఆర్ఆర్ టీం చేసిన సందడికి అంతా చప్పట్లు కొట్టారు.


Share

Related posts

Richa Panai Beautiful Images

Gallery Desk

Tdp Janasena: చంద్రబాబు దాచిన సీక్రెట్..! పవన్ తో బంధం అదేనా..?

Muraliak

Vijay Deverakonda Puri Jagannath: హీరో విజయ్ దేవరకొండకి మరో బంపర్ ఆఫర్ ఇచ్చిన పూరీ జగన్నాథ్..??

sekhar