NewsOrbit
న్యూస్

రెండో వందేభారత్ ట్రైన్ ను ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Narendra Modi inaugurated the Secunderabad Tirupati Vande Bharat Train

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ .. తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. ఆయన జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఇంతకు ముందు సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించగా, ఇప్పుడు రెండో ట్రైన్ ను ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభ వార్తే. తిరుపతి వెంకన్న దర్శనానికి వెళ్లే భక్తులు తక్కువ సమయంలో, ఉల్లాసంగా ప్రయాణం చేస్తూ వెళ్లే అవకాశం ఏర్పడుతుంది. కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే సికింద్రాబాద్ నుండి తిరుపతికి చేరుకోవచ్చు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రధాని మోడీ తొలుత రైలులో విద్యార్ధులతో ప్రత్యేకంగా మాట్లాడారు.

PM Narendra Modi inaugurated the Secunderabad Tirupati Vande Bharat Train
PM Narendra Modi inaugurated the Secunderabad Tirupati Vande Bharat Train

 

తొలుత బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి, గవర్నర్ తమిళి సై, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు ప్రధాని మోడీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మోడీ ప్రత్యేకంగా కైసే హో.. సంజయ్ అని అప్యాయంగా పకలకరించడం అందరినీ ఆకట్టుకుంది. ఇటీవల బండి సంజయ్ ను పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు తరలించడం తీవ్ర సంచలనం అయిన సంగతి తెలిసిందే. బెయిల్ పై బయటకు వచ్చిన సంజయ్ ప్రధాని మోడీని స్వాగతం పలికేందుకు బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు మొత్తం 32 మంది ప్రజా ప్రతినిధులు, అధికారులను అనుమతించారు.

PM Modi Bandi sanjay

 

వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రిమోట్ ద్వారా అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.1,350 కోట్లతో బీబీ నగర్ ఎయిమ్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మోడీ .. రూ.7,850 కోట్లతో చేపట్టనున్న జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేశారు. అయిదు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అదే విధంగా 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు.

సికింద్రాబాద్ – తిరుపతి వందేభారత్ రైల్ చార్జీలు ఖరారు చేసిన రైల్వే శాఖ .. ఎంతంటే..?

author avatar
sharma somaraju Content Editor

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N