NewsOrbit
జాతీయం న్యూస్

Deep Sidhu : దీప్ సిద్దూను పట్టుకునే పనిలో పోలీసులు!ఆచూకీ చెబితే అక్షరాలా లక్ష బహుమతి!

Deep Sidhu : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గణతంత్ర దినోత్సవం నాడు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పోలీసులు దృష్టిసారించారు.

Police in the process of catching Deep Sidhu!
Police in the process of catching Deep Sidhu!

జనవరి 26 కిసాన్ పరేడ్ ఘటనలపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు దేశద్రోహం సహా పలు సెక్షన్ల కింద 44 కేసులను నమోదు చేసి, చాలా మందిని అరెస్టు చేశారు. ఎర్రకోట దగ్గర జరిగిన ఘటనలతోపాటు పలు కేసులను క్రైం బ్రాంచ్ సెల్‌కు అప్పగించి వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ హింసాత్మక ఘటనలతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్‌ సిధు సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు బుధవారం ఢిల్లీ పోలీసులు ప్రకటించారు.కాగా ఈ ఘటనల్లో దీప్‌ సిధుతోపాటు మరికొంత మందికి సంబంధముందని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. సిధుతోపాటు జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్, గుర్జాంత్ సింగ్‌పై కూడా లక్ష రివార్డును ప్రకటించారు. వారితోపాటు బుటా సింగ్, సుఖ్‌దేవ్ సింగ్, ఇక్బాల్ సింగ్ ఆచూకీ సమాచారం అందిస్తే రూ.50 వేల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. దీప్ సిధుతోపాటు నేరుగా సంబంధమున్న వారంతా ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు పలు ప్రాంతాల్లో రెక్కి నిర్వహిస్తున్నారు. దీప్ సిధు బీహార్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎర్రకోట ఘటనకు సంబంధించి పోలీసులు 12 మంది ఫొటోలను విడుదల చేశారు.

Deep Sidhu : ఇంటర్నెట్ నిలిపివేతపై లాయర్ల నిరసన!

దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని రోజుల నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు పలు చర్యలు చేపట్టింది. ఈ చర్యలపై 140 మంది న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డేకు బుధవారం లేఖ రాశారు.సింఘు, ఘాజీపూర్, టిక్రీ బోర్డర్లల్లో ఇంటర్నెట్‌ సేవలపై నిషేధం విధించడంపై న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ప్రస్తుతం అందరికీ ఇంటర్నెట్‌ చాలా అవసరమని.. ఈ సేవలపై ఆంక్షలు విధించడమంటే.. ప్రాథమిక హక్కులు, జీవించే హక్కును హరించడమేనని పేర్కొన్నారు. ఇంటర్నెట్‌ సేవల నిలిపివేతపై సుమోటోగా విచారణ చేపట్టాలని కోరారు. దీంతోపాటు సేవలు పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరారు. జనవరి 26 హింసాత్మక ఘటనల అనంతరం ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ, ఘాజీపూర్ రైతు శిబిరాల పరిధిలో ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ టెలికం ఆపరేటర్లను ఈ నెల 30న ఆశించింది. మొదట ఆదివారం రాత్రి వరకు నెట్‌ సేవలపై నిషేధం విధించగా తాజాగా మళ్లీ దానిని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

 

author avatar
Yandamuri

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!