NewsOrbit
జాతీయం న్యూస్

Wrestler Murder Case: రెజ్లర్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం!ఒలింపిక్ మెడలిస్ట్ కోసం వేట!ఆచూకీ తెలిపిన వారికి లక్ష ఇస్తారట!

Wrestler Murder Case: ఒక హత్య కేసులో అనుమానితునిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ ను పట్టిచ్చినా.. ఆచూకీ తెలియజేసినా లక్ష రూపాయలు ఇస్తామని ప్రకటించారు ఢిల్లీ పోలీసులు. న్యూ ఢిల్లీలో ఛత్రసల్ స్టేడియం పార్కింగ్ ప్రదేశంలో జాతీయ జూనియర్ మాజీ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ రానా హత్యలో సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ కేసుకు సంబంధం ఉంది కాబట్టే సుశీల్ కుమార్ పరారీలో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయన ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే కేసులో నిందితుడిగా ఉన్న మరో వ్యక్తి అజయ్ ను పట్టిస్తే రూ.50వేలు ఇస్తామని రివార్డు ప్రకటించారు.

Police searching for Olympic medalist in Wrestler murder case
Police searching for Olympic medalist in Wrestler murder case

అసలేం జరిగిందంటే?ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియం వద్ద ఈ నెల నాలుగో తేదీన జరిగిన ఘర్షణలో 24 ఏళ్ళ ఓ రెజ్లర్ మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనలో భారత ఒలంపిక్ మెడలిస్ట్ సుశీల్ కుమార్ పాత్ర ఉందని పోలీసులకు సమాచారం అందగా లోతుగా దర్యాఫ్తు చేపట్టారు ఆ పక్కరోజే సుశీల్ కుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు .నాలుగు వ తేదీ రాత్రి రాత్రి ఒంటిగంట సమయంలో తీవ్ర గాయాలతో ఉన్న రెజ్లర్ సాగర్ కుమార్ ని వినాయక్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. సాగర్ కుమార్ ఢిల్లీలో ఓ పోలీసు హెడ్ కానిస్టేబుల్ కుమారుడు. సుశీల్ కుమార్ కు చెందిన ఈ స్టేడియం బయట ఓ ఇంటిలో సాగర్ కుమార్ తో సహా మరో ఇద్దరు ఉండగా వారిని వెళ్లిపోవాలని సుశీల్ కుమార్ కోరాడని తెలుస్తోంది. కానీ ఏం జరిగిందో గానీ పరిస్థితి ఘర్షణకు దారి తీసింది.

Wrestler Murder Case: వారిలో వారే ఘర్షణ పడ్డారు!

కాగా వారెవరో తనకు తెలియదని, ఈ ఘటన చాలా పొద్దుపోయిన తరువాత జరిగిందని సుశీల్ కుమార్ . వారు ఘర్షణకు దిగినట్టు తెలియడంతో సమాచారాన్ని తానే పోలీసులకు తెలియజేశానని ఆయన అప్పట్లో మీడియాకు చెప్పాడు. తన స్టేడియానికి, ఈ ఘటనకు సంబంధం లేదని అన్నాడు. అయితే ఆ తర్వాత సుశీల్ కుమార్ పరారు కావడం ఆయనపై అనుమానాలు పెంచింది .ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు

సుశీల్ కుమార్ ఒలింపిక్స్ మెడలిస్ట్!

సుశీల్ కుమార్ పాపులర్ రెజ్లర్.. 2008 లో జరిగిన బీజింగ్ ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని, 2012 లో లండన్ లో జరిగిన ఒలంపిక్స్ లో రజత పతకాన్ని సాధించాడు.కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

author avatar
Yandamuri

Related posts

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N