NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Police Vs Police: ఏపీ ఇంటెలిజెన్స్ పోలీస్ వర్సెస్ సీఆర్పీఎఫ్ పోలీస్ – నడిమిట్ల తెలంగాణ పోలీస్

Police Vs Police: హైదరాబాద్ లో నిన్న ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఏపికి చెందిన వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వం సీఆర్‌పీఎఫ్ భద్రత ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపిలో రఘురామ కృష్ణరాజు వర్సెస్ వైసీపీ (ప్రభుత్వ) వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భీమవరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవ వేడుకలకు రఘురామ కృష్ణరాజు హజరు కావాలని అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన భద్రతా సిబ్బందితో నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరారు. దీని కంటే ముందు రఘురామ ఏపి హైకోర్టును ఆశ్రయించి రక్షణ కోరారు.

Police Vs Police MP Raghu Rama Krishnam Raju Security Issue
Police Vs Police MP Raghu Rama Krishnam Raju Security Issue

తనపై కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఒక వేళ కేసులు నమోదు చేస్తే చట్టప్రకారం నడుచుకోవాలని, వెంటనే అరెస్టు చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలతో రఘురామ ఆదివారం రాత్రి ఏపికి బయలుదేరారు. అయితే తనను ఏపి ఇంటెలిన్స్ పోలీసులు ఫాలో అవుతున్నారని తెలుసుకున్నారు. ఇదే క్రమంలో భీమవరంలో తనకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన యువకులను పోలీసులు నిర్భందించి ఇబ్బందులు పెడుతున్నారని, వారి తండ్రులు ఫోన్ చేసి భీమవరం రావద్దని విజ్ఞప్తి చేయడంతో బేగంపేట రైల్వే స్టేషన్ లో రఘురామ దిగిపోయి హైదరాబాద్ లోని తన నివాసానికి వెళ్లిపోయారు. ఇది ఇలా ఉంటే సోమవారం నాడు రఘురామ ఇంటి వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ వీడియో తీస్తున్నాడన్న అభియోగంతో రఘురామ భద్రతా సిబ్బంది (సీఆర్‌పిఎఫ్ కానిస్టేబుళ్లు) అతన్ని అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. అతనిపై ఫిర్యాదు చేశారు.

 

అయితే తాను ఏపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుబానీ అలియాస్ ఫరూక్ భాషా అని, విధి నిర్వహణలో భాగంగా ఐఎస్‌బీ గేటు వద్ద స్టాటర్ గా ఉన్న సమయంలో తనపైనే రఘురామ కుటుంబ సభ్యులు, ఆయనకు భద్రతగా ఉన్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కారు (నెం.7777)లో ఎక్కించుకుని వెళ్లి ఇష్టానుసారంగా కొట్టారనీ, తాను ఏపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెబుతున్నా వినిపించుకోకుండా తన ఐడీ కార్డు, పర్సు కూడా లాక్కున్నారని ఫరూక్ బాషా పోలీసులు ఫిర్యాదు చేశాడు. అటు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది. ఇటు ఏపి కానిస్టేబుల్ (ఇంటెలిజెన్స్) ఫరూక్ బాషా ఇచ్చిన ఫిర్యాదులపై గచ్చిబౌలి (తెలంగాణ) పోలీసులు విచారణ చేపట్టారు. ఏపి కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎంపీ రఘురామ కుటుంబ సభ్యులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బందిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేస్తారా..? లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju

MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ ముగిసిన వాదనలు .. తీర్పు ఎప్పుడంటే..?

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju