Punjab Politics: పంజాబ్ లో స్పీడ్ గా మారుతున్న రాజకీయ పరిణామాలు!పంచాయతీ నిర్వహిస్తున్న కాంగ్రెస్ !!

Share

Punjab Politics: పంజాబ్ కాంగ్రెస్ లో రేగిన అసమ్మతి చిచ్చు ఆర్పేందుకు పార్టీ అధిష్టానవర్గం ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా ముగ్గురు పార్టీ సీనియర్ నాయకులతో కమిటీని ఏర్పాటు చేసింది.ఆ కమిటీ పంజాబ్ లో అసమ్మతి వర్గం కాంగ్రెసు నాయకులతో భేటీ అవుతోంది.పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్,మాజీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సిద్దూల మధ్య గతం నుండి ఉన్న ఘర్షణ ఇప్పుడు తారాస్థాయికి చేరింది.

Political developments changing speed in Punjab!
Political developments changing speed in Punjab!

సిద్ధూకు మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతిస్తూ అమరీందర్ సింగ్ ను పంజాబ్ ముఖ్యమంత్రిగా తొలగించాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ వద్దకు నేరుగా వెళుతున్నారు.వివాదం ముదిరి పాకాన పడ్డంతో కాంగ్రెస్ అధిష్టాన వర్గం అప్రమత్తమైంది.ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా అసమ్మతి వర్గాన్ని బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించింది.

కమిటీని కలిసిన నవజ్యోత్ సిద్దూ

కాగా అసమ్మతి వర్గం నాయకునిగా చలామణి అవుతున్న నవజ్యోత్ సిద్దూ మంగళవారం కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీని కలిశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “పంజాబ్ గెలుస్తుంది.. పంజాబీలు గెలుస్తారు”అని వ్యాఖ్యానించారు.’వాస్తవాలు చెప్పడానికే ఆ కమిటీ ని నేను కలిశాను. అట్టడుగుస్థాయి ప్రజల మనోభావాలను కూడా కమిటీకి వివరించాను.ప్రజాస్వామ్యంలో చేతిలోనే అధికారం ఉండాలన్నది నా భావన.అదే విషయాన్ని కమిటీకి వివరించాను” అని నవజ్యోత్ సిద్దూ వెల్లడించారు. నవజోత్ సిద్దూ వ్యాఖ్యలను విశ్లేషిస్తూ ఆయన వెంటనే పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ను తొలగించాలని ఆ కమిటీకి స్పష్టం చేసి వచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

వీరిద్దరి మధ్య విరోధం ఏమిటంటే?

2017 లో అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకు నవజ్యోత్ సిద్దూ కు మధ్య సత్సంబంధాలు లేవు.సిద్దూ ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించగా అమరీందర్ సింగ్ ఆయనను మంత్రి పదవికి పరిమితం చేశారు.ఆ తర్వాత కూడా వారు ఎడముఖం పెడముఖంగా ఉన్నారు.ఈ మధ్యే సిద్ధూ తన మంత్రి పదవిని కూడా వదులుకున్నారు.ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అమరిందర్ సింగ్ ఒక సందర్భంలో ఆమ్ ఆద్మీ పార్టీలోకి సిద్ధూ వెళ్లబోతున్నారని ఒక కామెంట్ చేశారు.దీంతో మరింత మండిపడ్డ సిద్దూ ఇంకొంత మంది ఎమ్మెల్యేల్ని చేరదీసి అమరీందర్ సింగ్ సీఎం సీటుకే ఎర్త్ పెట్టే కార్యక్రమాలు చేపట్టారు.దీంతో కాంగ్రెస్ అధిష్టానవర్గం జాగ్రత్తపడింది.కాంగ్రెస్ పార్టీకి మిగిలిన మూడు రాష్ట్రాల్లో ఒకటైన పంజాబ్ లో కూడా పరిస్థితులు చేజారకుండా చర్యలు తీసుకుంటోంది. గురువారం నాడు ఈ కమిటీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తో కూడా భేటీ అవబోతోంది.

 


Share

Related posts

Siddharth: టాలీవుడ్ ఇండస్ట్రీలో సిద్ధార్థ పట్టు ఇంకా కోల్పో లేదని రుజువు చేసిన వార్త..??

sekhar

మాట.. ఎన్నికల తూటా : కులం… రాజకీయ వ్యూహం.. !! పవన్ వ్యాఖ్యల వెనుక చాలా ఉంది

Comrade CHE

ఇంతలో ఎంత మార్పు?సీన్ పూర్తిగా రివర్స్!తెలంగాణలో ఏం జరుగుతోంది??

Yandamuri