political జాతీయం న్యూస్

Punjab Congress: 77మంది ఎమ్మెల్యేలలో 62 మంది సిద్ధూ వెంట!పంజాబ్ కాంగ్రెసులో రాజకీయ మంట!!

Share

Punjab Congress: పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కుర్చీ కదిలిపోతున్నట్లు కనిపిస్తోంది.ఆయన బద్ధవ్యతిరేకి, రాష్ట్ర పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేసినట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి.రాష్ట్రంలో డెబ్బై ఏడు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉంటే 62 మంది సిద్దూ వెనుక నడుస్తున్నట్లు తాజాగా సంభవించిన రాజకీయ పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి.

Political fire in Punjab Congress !!
Political fire in Punjab Congress !!

అమరీందర్ సింగ్ వర్సెస్ సిద్దూ!

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్,నవజోత్ సింగ్ సిద్దూ ల మధ్య విబేధాలు ఈనాటివి కావు.మొన్నటి ఎన్నికల్లోనే సిద్దూ ముఖ్యమంత్రి కావాలని పథక రచన చేసిన అమరేందర్ సింగ్ ఆ పీఠాన్ని అధిష్ఠించారు.సిద్దూ కి ప్రాధాన్యం లేని మంత్రిపదవి ఇచ్చి దాన్ని కూడా సీఎం ఈ మధ్య తీసేశారు.దీంతో సిద్ధూ రగిలి పోవడమే కాకుండా అమరీందర్ సింగ్ అంటే పడని అసమ్మతి వాదులను పోగేశారు.ఒకటికి రెండుసార్లు హస్తినకు వెళ్లి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి పంజాబ్ లో అమరీందర్ సింగ్ హయాంలో పార్టీ పతనం అయిపోయిందని, రేపటి ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని ముఖ్యమంత్రిని మార్చాలని చెవిలో జోరీగలా పోరారు

హైకమాండ్ రాజీ ఫార్ములా!

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఒక రాజీ ఫార్ములా రూపొందించింది ఇందులో భాగంగా సిద్దూను పంజాబ్ రాష్ట్ర పీసీసీ చీఫ్ గా నియమించింది.దీంతో సీఎం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కలిసి పని చేసుకుంటారన్నది కాంగ్రెస్ హైకమాండ్ యోచన.కానీ సిద్దూ అంటే ఏమాత్రం పడని సీఎం అతనితో కలిసి పని చేయడానికి ఇష్టపడడం లేదు.గతంలో తనపై సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్తే తప్ప ఆయనతో కలిసి ప్రయాణించలేనని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తేల్చిచెప్పారు.దీంతో సమస్య మరింత జటిలమైంది .సిద్ధూ ఇంకా రెచ్చిపోయి ఎమ్మెల్యేలను కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.అది వర్కవుట్ అయింది.

స్వర్ణ దేవాలయ సందర్శనకు సిద్ధూతో ఎమ్మెల్యేల క్యూ

బుధవారం స్వర్ణ దేవాలయం సందర్శనకు పెద్ద ఎత్తున నేతలు తరలి రావాలన్న సిద్ధూ పిలుపునకు ఎమ్మెల్యేల నుంచి భారీ స్పందన వచ్చింది.ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్దూ నివాసానికి సుమారు 62 మంది ఎమ్మెల్యేలు వచ్చారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇది సిద్దూ బలప్రదర్శనలా కనిపించింది.అంతేగాక, అమృత్‌సర్‌లో భారీ ఎత్తున సిద్దూ కటౌట్లు వెలిశాయి. స్వర్ణదేవాలయానికి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. మంత్రులు సుక్బీందర్ సింగ్, త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖద్ కూడా పాల్గొన్నారు.ఇవన్నీ చూస్తుంటే పంజాబ్ లో త్వరలోనే పెను రాజకీయ మార్పులు సంభవించే అవకాశం ఉందనిపిస్తుంది .

 


Share

Related posts

Bigg Boss 5 Telugu: గెలిచినా గాని త్యాగం చేసిన లోబో..!!

sekhar

మహాభారతంలో శ్రీకృష్ణుడు !!

Sree matha

Sekhar kammula: తీసిన సినిమానే మళ్ళీ తీస్తే ఎవరు చూస్తారు..శేఖర్ కమ్ముల మీద నెగిటివ్ కామెంట్స్

GRK