NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Andhra Pradesh: ఏపీ రాజకీయ చదరంగంలో పది పరిక్షలు..! ఎవరు ఒప్పు.. ఎవరు తప్పు..?

AP Politics: Best Gossip but Interesting Facts

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh దేశం మొత్తం కరోనా విలయతాండవం చేస్తోంది. ఏపీలో కరోనాతోపాటు పది, ఇంటర్ పరీక్షల అంశం రాజకీయంగా హీటెక్కిస్తోంది. ప్రభుత్వం ఓపక్క, రాజకీయ పార్టీలు, వ్యవస్థలన్నీ ఓపక్క పరీక్షలపై తమ వాదనలు వినిపిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, తనయుడు లోకేశ్ పది పరీక్షలను రద్దు చేయాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. నేడు క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా సీఎం జగన్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. విద్యార్ధుల భవిష్యత్తు నేపథ్యంలోనే కష్టమైనా, అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సర్టిఫికెట్లపై పాస్ అనేది విద్యార్ధుల భవిష్యత్తుకు మంచిది కాదని అన్నారు. ఈ నిర్ణయంపై టీడీపీ మండిపడుతోంది.

politics around 10th exams in ap
politics around 10th exams in ap

అయితే.. ఇదే నిర్ణయం చంద్రబాబు సీఎంగా ఉండి తీసుకుంటే.. ‘విద్యార్ధుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న దార్శినికుడు, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ధైర్యంగా అడుగేస్తున్న చంద్రబాబు.. సుదీర్ఘ రాజకీయ అనుభవం.. రియల్ పరిపాలనాదక్షుడు’ అని టీడీపీ నేతలు బాకా ఊదేవారంటూ పొలిటికల్ కామెంట్స్ వస్తున్నాయి. దీనికి వైసీపీ నేతలు.. గతేడాది సీఎం జగన్ కరోనాపై మాట్లాడుతూ ‘కరోనాతో కలిసి జీవించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. జగన్ వ్యాఖ్యలను నాడు చంద్రబాబు విమర్శించారు. కానీ.. జగన్ చెప్పిన మాటనే ఎందరో నిపుణులు తర్వాత చెప్పారు కదా అనేది వారి మాట. పరీక్షల విషయంలో కూడా జగన్ ఆలోచనను విద్యార్ధులు, తల్లిదండ్రులు అర్ధం చేసుకుంటారనేది వారి వాదన.

ఈ అంశాన్ని రాజకీయంగా తీసుకుంటే ఎవరి వాదన వారిదే అవుతుంది. 2015 గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అతిపెద్ద తప్పు ఇక్కడ ప్రస్తావనార్హం. రాజమండ్రి ఘాట్ లో తనపై దర్శకుడు బోయపాటి శ్రీనుతో డాక్యుమెంటరీ చిత్రీకరించే ఏర్పాటు చేశారు. కానీ.. ఆ ఆలోచన ఏకంగా 26 మంది అక్కడే తొక్కిసలాటలో మృతి చెందేలా చేసింది. అధికార దర్పంతో అత్యుత్సాహంతో చేసిన పని ఇది. ఇప్పుడు కూడా సీఎం హోదాలో జగన్ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఊహించలేని విపత్తుకు కారణం కాకూడదు. మరి.. విషయం కోర్టుల వరకూ వెళ్తోంది. ప్రస్తుతానికైతే జూన్ లో పరిక్షల నిర్వహణకు వెళ్తున్నారు. ఈలోపు సీఎం జగన్ నిర్ణయం మారుతుందా? కోర్టులే నిర్ణయిస్తాయో చూడాలి.

author avatar
Muraliak

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju