ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యుడు, బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు దాదాపు ఖాయమైనట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం కూడా అలెర్ట్ అయ్యింది. స్వయంగా కేసిఆర్ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు, ముఖ్యనేతలతో ఈ అంశంపై మాట్లాడినట్లు తెలుస్తొంది. పొంగులేటి పార్టీ వీడినా అతని వెంట బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా చూడాలని నేతలకు సూచించినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీన పొంగులేటి కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారని తెలిసినా ఆయనను బీఆర్ఎస్ నుండి వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు ఏమీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో పొంగులేటి మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. పినపాకలో తన అనుచర వర్గంలో సమావేశమైయ్యారు. తాను పినపాక వస్తే ఇక్కడ ఏమిపని ఉంటూ కొందరు అంటున్నారనీ, ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు తాను వచ్చానని తెలిపారు. పార్టీ మారుతున్నాననో, పార్టీ మారడం లేదనో తాను చెప్పడం లేదనీ, మనసులోని ఆవేదనను చెబుతున్నానని అన్నారు.

కేసిఆర్, కేటిఆర్ పై నమ్మకంతోనే తాను టీఆర్ఎస్ లో చేరానని పొంగులేటి పేర్కొన్నారు. అయితే నాలుగేళ్లలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయనీ, సందర్బం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెబుతానన్నారు. నిజాలను అప్పుడు ఇప్పుడూ నిర్బయంగానే చెబుతాని వ్యాఖ్యానించారు. తన వ్యాపార లావేదేవీలపై త్వరలోనే చెబుతానన్నారు. రాజకీయాల్లోకి రాకముందే టాప్ టెన్ కాంట్రాక్టర్ లలో తాను ఒకడినని పేర్కొన్నారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చేస్తున్న ప్రతి పనికి అనుభవించక తప్పదనీ, వడ్డీతో సహా తిరిగి చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. తనకు రాజకీయంగా గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరనీ, తెలంగాణ ప్రజలే తనకు గాడ్ ఫాదర్లు అని పేర్కొన్నారు పొంగులేటి.
పదవులు ఇచ్చినా ఇవ్వకున్నా మనిషిని గౌరవించాలని, పదవులు అవే వస్తాయి. పోయేటప్పుడు అవే పోతాయని అన్నారు. తానేమీ భూదందాలు చేయలేదన్నారు. గౌరవం దగ్గని చోట గొంతు ఎత్తకుండా ఉండలేనని అన్నారు. తనకు సెక్యురిటీ తగ్గించిన విషయంపై మాట్లాడుతూ తనకు భద్రత తగ్గించినా తానేమీ అడగననీ, ఉన్న ఇద్దరు గన్ మెన్లను తీసేసినా భయపడేది లేదన్నారు. తనకు సెక్యురిటీ అవసరం లేదని పొంగులేటి వ్యాఖ్యానించారు.
నేటి రాజకీయాలపై మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు