Pooja hegde: కోలీవుడ్ మేకర్స్‌కు టాటా చెప్పిన పూజా హెగ్డే..సోషల్ మీడియాలో కామెంట్స్ వైరల్..

Share

Pooja hegde: సౌత్ సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న కన్నడ భామ పూజా హెగ్డే బాలీవుడ్‌లోనూ ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. తెలుగులో పూజా హెగ్డే నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. అందులో ఒకటి పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన రాధే శ్యామ్. ఈ సినిమా న్యూ ఇయర్‌లో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అలాగే మెగాస్టార్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆచార్య సినిమా. ఈ సినిమా 2022, ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.

pooja-hegde-completed beast movie in kollywood
pooja-hegde-completed beast movie in kollywood

ఇక తమిళంలో మరో క్రేజీ ప్రాజెక్ట్ చేస్తోంది పూజా హెగ్డే. ఎప్పుడో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన పూజా ఆ తర్వాత మళ్ళీ అక్కడ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే తెలుగులో క్రేజీ హీరోయిన్‌గా మారడంతో మళ్ళీ కోలీవుడ్ మేకర్స్ పూజాకు భారీ ప్రాజెక్ట్‌లో ఆఫర్స్‌ ఇచ్చారు. ఆ సినిమానే తమిళ స్టార్ హీరో నటిస్తున్న బీస్ట్. భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. కళానిధి మారన్ నిర్మాత. కాగా, ఈ సినిమా లో నటిస్తున్న పూజా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసింది.

Pooja hegde: ఈ విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఈ విషయాన్ని తాజాగా ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు కాసేపు అభిమానులతో చిట్ చాట్ చేసిన పూజా హెగ్డే భీస్ట్ సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకుంది. ఈ నేపథ్యంలో సినిమాలో తన పాత్ర చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు సినిమా చూస్తున్నంతసేపు కడుపుబ్బా నవ్వుతూనే ఉంటారని చెప్పుకొచ్చింది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని పూజా హెగ్డే అందుకుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. హిందీలో సల్మాన్ సరసన ఓ సినిమా చేస్తోంది. ఇందులో వెంకటేశ్ కూడా మరోగా నటిస్తున్నారు.


Share

Related posts

ఏపీ వద్దు.. తెలంగాణ ముద్దు…!!

sekhar

Hyper Aadi: హైపర్ ఆది పై ప్రముఖ హీరోయిన్ కామెంట్స్ వైరల్..!

Ram

బిగ్ బాస్ 4 : బిగ్ బాస్ రూల్స్ నే మార్చేసిన అక్కినేని అఖిల్ – సమంత..! వదినని అటపట్టించిన మరిది

arun kanna