Pooja Hegde: పవన్ అయితే ఏంటి.. వెయిట్ చేసే ప్రసక్తే లేదు.. పూజా హెగ్డే సంచలన కామెంట్స్..?

Share

Pooja Hegde: తెలుగు, తమిళ్, హిందీ ఇలా భాష ఏదైనా సరే తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అగ్రతార పూజా హెగ్డే. ఇటీవల విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌లో ఆమె అద్భుతమైన నటనా చాతుర్యంతో ఇరగదీసింది. దాంతో సినీ ప్రేక్షకులతో పాటు విమర్శకులు సైతం ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. గ్లామర్ డాల్ గా మాత్రమే కాకుండా ఈ ముద్దుగుమ్మ తనలోని యాక్టింగ్ స్కిల్స్ బయటపెడుతూ వావ్ అనిపిస్తోంది. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ బుట్టబొమ్మ సర్కసు(cirkus), బీస్ట్(beast), ఆచార్య(Acharya) సినిమాల్లో హీరోయిన్ రోల్ లో నటిస్తోంది. ఇవన్నీ అగ్రహీరోల భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం. ఇప్పుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) సినిమాలో కూడా ఆమె నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కానీ ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. అదేంటంటే… ఎవరైతే నాకేంటి.. వెయిట్ చేయాల్సిన ప్రసక్తే లేదంటూ పూజా ధోరణి ఉన్నట్లు సినీ వర్గాల భోగట్టా.

పవన్ అయితే ఏంటి?


పూజా నటించిన సినిమాలన్నీ వరుసగా హిట్స్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎగబడుతున్నారు. బుట్టబొమ్మతో ఆమె ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పాలా.. నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ రూపొందించిన పాట యూట్యూబ్ రికార్డులను తిరగరాసింది. అల వైకుంఠపురములో సినిమాతో ఆమె క్రేజ్ వేరే స్థాయికి చేరుకుంది. వద్దన్నా సినిమా అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో హరీష్ శంకర్(Harish Shankar) సైతం పవన్ సరసన పూజా హెగ్డేని నటింపజేయాలని బలంగా డిసైడ్ అయ్యారు. హరీష్ పవన్ కల్యాణ్ హీరోగా “భవదీయుడు భగత్ సింగ్(Bhavadeeyudu Bhagat Singh)” అనే సోషల్ డ్రామా/పొలిటికల్ థ్రిల్లర్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నటించమని పూజా హెగ్డేని హరీష్ తాజాగా కోరారు. అయితే పూజా హెగ్డే పవన్ సినిమాలో నటించేందుకు పచ్చ జెండా ఊపినట్టు హరీష్‌శంకర్‌ ఇటీవల ఓ మూవీ ఫంక్షన్ లో ప్రకటించారు.

వెయిట్ చేసే ప్రసక్తే లేదు..


“భవదీయుడు భగత్ సింగ్” చిత్రంలో పవన్ సరసన నటించేందుకు పూజా హెగ్డే అంగీకరించింది.కానీ ప్రొడ్యూసర్ల నుంచి మాత్రం అడ్వాన్స్ పేమెంట్ తీసుకోలేదు. ఇందుకు కారణం డేట్స్ విషయంలో స్పష్టత రాక పోవడమే! పూజాకి ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది. దీపం వెలిగి ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా.. ప్రస్తుతం అదే సూత్రాన్ని పాటిస్తూ పూజా కూడా తన పాపులారిటీని ఉపయోగించుకొని భారీ బడ్జెట్ సినిమాల్లో అగ్ర హీరోలతో కలిసి నటించేస్తోంది. కానీ పవన్ సినిమా విషయంలో ఆమె కాస్త వెనకడుగు వేస్తోంది. దీనికి కారణం పవన్ తన రాజకీయ జీవితంలో ఎప్పుడు బిజీ అవుతారో తెలియదు. ఆయన బిజీగా లేకపోతే ఇప్పటికే హరీష్‌శంకర్ తో సినిమా స్టార్ట్ అయ్యి సగం షూటింగ్ పూర్తి చేసుకుని ఉండేది. కానీ అది ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. దీంతో పవన్ షూటింగ్ కు ఎప్పుడొస్తారు? అతనితో కలిసి ఎప్పుడు నటించాలి? కాల్ షీట్స్ ఇప్పుడు ఇవ్వాలి? అనే సందేహాలను పూజా వ్యక్తం చేస్తోంది. దీనిపై హరీష్ శంకర్ కూడా క్లారిటీగా సమాధానం ఇవ్వలేక పోతున్నారు. దాంతో ఆమె పవన్ అయితే ఏంటి? కేవలం ఒక సినిమా కోసం మిగతా అన్ని సినిమాల కాల్షీట్స్ పాడు చేసుకోలేను.. సరైన డేట్స్ కేటాయించేంత వరకు ప్రాజెక్ట్ కి సంతకం చేసే ప్రసక్తే లేదు.. అని ఆమె సున్నితంగా చెప్పినట్లు సమాచారం. రెండు నెలల తర్వాత హరీష్ శంకర్ డేట్స్ కోరితే ఆమె తన డేట్స్ సర్దుబాటు చేయడానికి సిద్ధంగా ఉందని వినికిడి.


Share

Related posts

బిగ్ బాస్ 4 : గంగవ్వ వెళ్లిందని బాధపడకండి… ఆమె స్థానంలో మరొక స్టార్ సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

arun kanna

జమ్మూ కాశ్మీర్‌ర్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టేస్తారా..??

Special Bureau

Bigg boss 5 : ఈసారి ‘బిగ్ బాస్ 5’లో ఆలీతో సరదాగా ..?

GRK