పూజా హెగ్డే తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. చెప్పాలంటే పూజా హెగ్డే డేట్స్ కోసం మేకర్స్ క్యూ కడుతున్నారు. అలా అని ప్రతీ సినిమా ఒప్పుకోవడం లేదు. స్టార్ హీరో, దర్శకుడు .. బాగా వేయిట్ ఉన్న కథ.. పెద్ద నిర్మాణ సంస్థ అయితేనే ఒప్పుకుంటుంది. ఒకరకంగా చెప్పాలంటే పూజా హెగ్డే కెరీర్ ప్రారంభం నుంచి చిన్న సినిమాలు చేసింది లేదు. యంగ్ హీరో నాగ చైతన్య, వరుణ్ తేజ్ డెబ్యూ సినిమా ముకుంద మాత్రమే కాస్త మీడియం బడ్జెట్ సినిమాలు. ఆ తర్వాత ప్రతీ ప్రాజెక్ట్ భారీ ప్రాజెక్టే. అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పాపులర్ అయింది.
అయితే పూజా హెగ్డే కి ముందు నుంచి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక బలంగా ఉండేది. అనుకున్నట్టుగానే బాలీవుడ్ లో ఆ ఫీట్ సాధించింది. ఆమధ్య బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో నటించిన హౌజ్ ఫుల్ 4 తో భారీ హిట్ అందుకుంది. దాంతో బాలీవుడ్ లో పూజా హెగ్డే కి వరసగా ఛాన్సులు వస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ తో నటిస్తూనే బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ లాంటి బాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.
చెప్పాలంటే పూజా హెగ్డే టాలీవుడ్.. బాలీవుడ్ ని బాగా బ్యాలెన్స్ చేస్తోంది. ఎక్కడ కూడా క్రేజీ ప్రాజెక్ట్ అయితే వదలడం లేదు. ప్రస్తుతం తెలుగులో రాధకృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధే శ్యాం సినిమాలో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. ఈ సినిమాతో పూజా హెగ్డే భారీ హిట్ అందుకుంటుందని ధీమాగా ఉంది. అలాగే యంగ్ హీరో అఖిల్ అక్కినేని తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అన్న సినిమా కూడా చేస్తోంది. ఈ సినిమా కూడా పూజా హెగ్డే గట్టి గా నిలవబోతోందని అంటున్నారు. కాగా త్వరలో పూజా హెగ్డే నటించబోయే తెలుగు సినిమాలని అనౌన్స్ చేయబోతున్నట్టు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!