Pooja Hegde: ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే ఇతర భాషా చిత్రాల్లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా మారుతోంది. వరుస హిట్ సినిమాలతో ఫుల్ ఫేమస్ అవుతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతోంది. అయితే ఎంత బిజీగా ఉన్నా ఫ్యాషన్ పై తనకున్న మక్కువను మాత్రం ఆమె చంపుకోవట్లేదు. షూటింగ్లో కాస్త టైమ్ దొరకగానే తనలో ఉన్న ఆల్ట్రా మోడ్రన్ ఫ్యాషన్ గర్ల్‌ను మనకి పరిచయం చేస్తుంది.
Pooja Hegde: ఆ డ్రెస్‌లో లుక్ అదుర్స్
ఈసారి ఈ అమ్మడు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టోర్ బయట తనలోని స్టైలిష్ యాంగిల్‌తో కెమెరాల కంట పడింది. తను వేసుకున్న పల్చటి కలర్ టాప్‌కి తగ్గట్టుగా డెనిమ్ జీన్స్, స్పోర్ట్స్ షూ వేసుకొని బ్యూటిఫుల్ లుక్‌తో అందరినీ ఆకర్శించింది. అన్ని లైట్ కలర్స్ అవుట్ ఫిట్ వేసుకున్న పూజా వాటికి డిఫరెంట్‌గా తన చేతిలో నల్లటి సేయింట్ లారెంట్ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంది. దాంతో ఆమె లుక్ ఇంకాస్త పెరిగింది. ఈ అమ్మడు లుక్ చూసి అందరి కళ్లు అమ్మడు వైపే తిరిగాయి. యంగ్ గర్ల్‌గా కనిపించడమే కాదు ఆఫ్‌స్క్రీన్ హాట్ డ్రెస్‌లు ధరించి కూడా ఈ ముద్దుగుమ్మ కుర్రాళ్లకు నిద్ర లేని రాత్రులు నిద్రలు మిగుల్చుతుంది.
టాప్ పొజిషన్‌కే గురి
టాలీవుడ్‌లోని టాప్ హీరోయిన్ సమంతతో పోటీపడే టాప్ పొజిషన్ని కొట్టేయడానికి చాలా ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే పూజా తన ఫ్యాషన్ ట్రెండ్ తో సామ్‌కి పోటీగా నిలుస్తుంది. ప్రస్తుతం ఈ తార కిసీ కా భాయ్ కిసీ కి జాన్, SSMB28, సర్కస్ వంటి సినిమాలలో యాక్ట్ చేస్తోంది.