డార్లింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న తాజా చిత్రం “రాధే శ్యామ్”. జిల్ ఫేం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు. బాహుబలి ఫ్రాంఛైజీ, “సాహో” లాంటి భారీ సినిమాల తర్వాత “రాధే శ్యామ్” వస్తుండడంతో దేశ వ్యాప్తంగా.. అలాగే అన్ని చిత్ర పరిశ్రలలో బాగా అంచనాలు నెలకొన్నాయి.
ఇక అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి ఫ్యాన్స్ థ్రిల్లయ్యే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఇప్పటికే రాధే శ్యామ్ యూనిట్ టీజర్ ను కట్ చేసి తుది మెరుగులు దిద్దుతున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ టీజర్ కు జిబ్రాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించనున్నాడట.
కాగా పూజా హెగ్డే తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది. అంతేకాదు ఎప్పుడు లేనంతగా హ్యాపిగా ఉందట. అందుకు కారణం డార్లింగ్ ప్రభాస్ అని తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తుఇన్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ మొదలవబోతుంది. 15 రోజుల షెడ్యూల్ విదేశాలలో కంప్లీట్ చేసుకొని వచ్చి మిగతా షూటింగ్ మొత్తం హైదరాబాద్ లో ఫినిష్ చేయనున్నారు.
ఈ క్రమంలో ‘రాధే శ్యామ్’ సెట్ లో రెండు సెలబ్రేషన్ జరగనున్నాయని పూజా సంబరపడుతోంది. అందులో ఒకటి ప్రభాస్ బర్త్ డే కాగా ఓది పదిరోజుల ముందే అంటే అక్టోబర్ 13 న పూజా హెగ్డే బర్త్ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయట. ఇప్పటికే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన పూజా ‘రాధే శ్యామ్’ షూట్ లో జాయిన్ కాబోతుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!