మళ్ళీ పూజా నే హైలెట్ అయిందంటున్నారూ ..అంటే అఖిల్ ..?

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ అక్కినేని – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పిస్తుండగా బన్నీ వాసు, వాసు వర్మ కలిసి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా నుంచి దసరా సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ టీజర్ కి అక్కినేని అభిమానుల నుంచి.. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

Most Eligible Bachelor: Akhil Finds The Recipe for Success?

అయితే నెటిజన్స్ మాత్రం కాస్త భిన్నంగా కామెంట్స్ చేస్తున్నారట. టీజర్ లో కొన్ని ఫ్రేమ్స్ లో అఖిల్ ని, పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ పరంగా డామినేట్ చేసేసిందని అభిప్రాయపడుతున్నారట. అంతేకాదు స్క్రీన్ మీద ఈ జంట అంతగా సెట్ కాలేదేమో అన్న సందేహాలు వెలిబుచ్చుతున్నట్టు తెలుస్తుంది.
ఒక్కో ఫ్రేమ్ లో ఒక్కో రకంగా కనిపిస్తున్నారని.. ఇంకా చెప్పాలంటే అఖిల్ కంటే పూజా బాగా పెద్దదిగా కనిపిస్తుందని మాట్లాడుకుంటున్నారట.

ఇలా మాట్లాడుకోవడానికి కారణం లేకపోలేదు. వయసు పరంగా చూస్తే అఖిల్ వయసు 26 ఏళ్ళు అయితే పూజా హెగ్డే వయసు 30 ఏళ్ళు. ఇది కూడా కంపేర్ చేసుకొని ఈ సినిమాకి హీరో, హీరోయిన్ పర్‌ఫెక్ట్ గా సెట్ కాలేదన్న టాక్ వినిపిస్తుంది. వాస్తవంగా ముందు నుంచి అఖిల్ సినిమాలకి హీరోయిన్ సమస్య వస్తూనే ఉంది. ఈ సారి ఈ కంపేరిజన్స్ రావడం కాస్త ఆశ్చర్య కరమే.

అయితే సినిమా మాత్రం సూపర్బ్ గా వచ్చిందని యూనిట్ తో పాటు గా నాగార్జున అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు క్యూట్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా అఖిల్ భారీ హిట్ ఇవ్వడం ఖాయమని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి అఖిల్ ఎంతగానో ఎదురు చూస్తున్న హిట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో దక్కుతుందో లేదో.