Poonam Kaur: పూనం కౌర్ సంచలనం అతడు గెలిస్తే మొత్తం విషయాలు బయట పెడతా..!!

Share

Poonam Kaur: పోసాని కృష్ణ మురళి ఇటీవల మీడియా సమావేశం నిర్వహించి పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ అభిమానులు.. పోసాని ఫోన్ కి.. ఆయన భార్య గురించి అసభ్యకరంగా మెసేజ్ లు.. పెట్టడంతో పోసాని కృష్ణ మురళి.. మీడియా సమావేశం పెట్టి ఏకిపారేశారు. ఇండస్ట్రీలో పంజాబీ రాష్ట్రం నుండి ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగు వాళ్ళు మంచి వాళ్ళు అని ఎక్కడికి వచ్చినా పూనమ్ కౌర్ అనే హీరోయిన్ ని.. పవన్ కళ్యాణ్ కడుపు చేసి మోసం చేశాడని, హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించాడు… ఆమెను ఆమె కుటుంబ సభ్యులను.. పవన్ బెదిరించాడని భారీగా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో… పోసాని విమర్శలు చేయడం జరిగింది.

Pawan Kalyan's fan association files a complaint against actor Posani  Krishna Murali - find out why

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అదేరీతిలో ఏపీ రాజకీయాల్లో పూనమ్ కౌర్ పేరు మారుమ్రోగింది. పరిస్థితి ఇలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో కంటే ఈ సారి మా అధ్యక్ష పదవికి.. చాలా మంది పోటీ పడుతూ ఉన్నారు. అక్టోబర్ 10వ తారీకు అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం మా క్రమశిక్షణ కమిటీ వద్ద నామినేషన్ దాఖలు చేసిన పలువురు కీలక పోటీదారులు.. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు.

Poonam Kaur: ప్రకాష్ రాజ్ గెలిస్తే నా సమస్యలు బయటపెడతా.. పూనమ్ ట్వీట్! If Prakash  Raj wins, my problems will be revealed .. Poonam kaur tweet!

ప్రకాష్ రాజ్ గెలవాలి 

ముఖ్యంగా ప్రకాష్ రాజ్ ప్యానల్… విష్ణు ప్యానల్ మధ్య పోటా పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది. ప్రకాష్ రాజ్ కి… మెగా కాంపౌండ్ హీరోల సపోర్ట్ బలంగా ఉండటంతో… టీవీ డిబేట్ లలో.. పాల్గొంటూ తీవ్రస్థాయిలో ప్రత్యర్థులపై కౌంటర్లు వేస్తూ తాను మా అధ్యక్షుడు అయితే ఏం జరుగుతుందో వివరిస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో హీరోయిన్ పూనమ్ కౌర్.. తాజాగా మా అధ్యక్ష ఎన్నికలు గురించి సోషల్ మీడియాలో స్పందించింది. తన ఫుల్ సపోర్ట్ నటుడు ప్రకాష్ రాజ్ కి అని తెలిపింది. మా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలవాలి అని కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రకాష్ రాజ్ గెలిస్తే ఎంతకాలం నేను ఎదుర్కొన్న సమస్యలు మొత్తం బయట పెడతా, చిల్లర చెత్త రాజకీయాలు చేయరు ఆయన అంటూ ప్రకటన చేయడం జరిగింది.

Your Film Budget Equals Pawan's Morning Show Collection', Prakash Raj To  Vishnu -

విష్ణు పై ప్రకాష్ రాజ్ పంచ్ లు

అంత మాత్రమే కాక పెద్దలను గౌరవించే వ్యక్తిత్వం కలిగిన మనిషి ప్రకాష్ రాజ్ అని.. పూనం కౌర్ చెప్పుకొచ్చింది. దీంతో ప్రకాష్ రాజ్ అధ్యక్షుడు గా గెలిస్తే… పూనమ్ ఎలాంటి విషయాలు.. బయట పెడుతుందో అనే దానిపై బయట రకరకాల డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ప్రకాష్ రాజ్ తో… దిగిన ఫోటో ను తాజాగా పూనం రిలీజ్ చేయడం జరిగింది. గతంలో వీరిద్దరూ శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలో తండ్రి కూతురు గా నటించారు. మరోపక్క ప్రకాష్ రాజ్… ఇటీవల మంచు విష్ణు తనపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ లు వేస్తున్నారు. రిపబ్లిక్ ఫ్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యల విషయంలో… ప్రకాష్ రాజ్.. స్పందన ఏంటో తెలియజేయాలని విష్ణు మీడియా ముఖంగా కోరారు. అయితే తాను ఇండస్ట్రీ తరఫున ఉన్నానని ఇండస్ట్రీలో భాగం పవన్ అని, పవన్ ముందు నటుడు ఆ తర్వాత రాజకీయ నాయకుడు అయినా కానీ పవన్ మార్నింగ్ షో కలెక్షన్ ఎంత బడ్జెట్ మీ సినిమా ఉండదని వ్యంగ్యంగా తనదైన శైలిలో విష్ణు పై.. ప్రకాష్ రాజ్ మండిపడ్డారు.


Share

Related posts

వల్లభనేని వంశీ … ఓ క‌న్నేయాల్సిందే జ‌గ‌న్‌

sridhar

నలుగురు డైరెక్టర్లతో చిరంజీవి..!!

sekhar

మోదితో ఆ నలుగురు భేటీ

somaraju sharma