NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

మునుగోడు ఉప ఎన్నికల బరిలో ప్రజా గాయకుడు గద్దర్ .. ఏ పార్టీ నుండో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా గాయకుడు గద్దర్ పోటీ చేయనున్నారు. పోటీ చేస్తున్న విషయాన్ని ఆయన ఈ రోజు ప్రకటించారు. అయితే గద్దర్ ఏ పాార్టీ నుండి పోటీ చేయనున్నారు అనేది తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఎందుకంటే.. విప్లవ భావాలు కల్గిన ప్రజా గాయకుడు గద్దర్ .. తన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని జాగృతం చేశారు. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమం లో సైతం ఆయన పాటలు ఎంతో మందిలో స్పూర్తిని నింపాయి. గతంలో ఎప్పుడూ ఓటు హక్కును కూడా వినియోగించుకోలేదు. అయితే ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చినట్లుగా ఇటీవల పరిణామాలు చూస్తే అర్ధం అవుతుంది. గత ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ లో జరిగిన మోడీ బహిరంగ సభకు హజరై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆ తర్వాత ఓ సారి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెళ్లారు. ఈ పరిణామాలతో ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనేందుకు ఏదైనా రాజకీయ పార్టీలో చేరతారేమో అన్న ఊహాగానాలు వచ్చాయి.

Gaddar
Gaddar

 

అయితే మునుగోడు ఉప ఎన్నికల వేళ గద్దర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కేఏ పాల్ నేతృత్వంలోని ప్రజాశాంతి పార్టీ (పీఎస్పీ) కండువా కప్పుకున్నారు. ఈ నెల 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని శాంతి ర్యాలీ నిర్వహణకు కేసిఆర్ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ కేఏ పాల్ ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. గద్దర్ ఈ రోజు కేఏ పాల్ ను కలిసి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. పిఎస్పీ తీర్ధం పుచ్చుకున్న గద్దర్ .. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజా శాంతి పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం నుండి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు. ప్రపంచ శాంతి కోసం శ్రమిస్తున్న కేఏ పాల్ తో కలిసి పని చేయాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు గద్దర్ తెలిపారు. గద్దర్ ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తున్నారని ప్రకటించడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

Gaddar

author avatar
sharma somaraju Content Editor

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju