Pawan Kalyan: పవన్ కి పోసాని కృష్ణమురళి బంపర్ ఆఫర్.. గుడి కట్టి పూజలు చేస్తానంటున్నాడు..!!

Share

Pawan Kalyan: సినీ నటుడు సీనియర్ నటుడు పోసాని కృష్ణ మురళి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీరియస్ కామెంట్లు చేశారు. ఏపీ సీఎం జగన్ తో పోల్చుకునే అంత వ్యక్తిత్వం పవన్ కి అసలు ఉందా అని ప్రశ్నించారు. జగన్ పాలన పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని.. నువ్వెక్కడ ఆయన ఎక్కడ అన్న తరహాలో సెటైర్లు వేశారు. తెల్లారి లేస్తే చాలు ఉద్యోగం జపం చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటావు అని పవన్ పై మండిపడ్డారు. నువ్వేంటో నీ అసలు రూపం ఏంటో ఇండస్ట్రీకి సమాజానికి ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టే రెండు చోట్ల నిన్ను ఓడించి ప్రజలు ఇంట్లో కూర్చో పెట్టారని విమర్శించారు. ఆడవాళ్లు అంటే ఎంతో గౌరవం అదే రీతిలో వాళ్ళ వైపు చూస్తే కళ్ళు పీకేస్తా.. అంత సినిమా లో డైలాగులు చెప్పే పవన్ .. ఇండస్ట్రీలో మోసపోయిన పంజాబీ అమ్మాయికి న్యాయం చేస్తే పవన్ కి గుడి కట్టి పూజలు చేస్తానంటు పోసాని షాకింగ్ కామెంట్ చేశారు. ఇండస్ట్రీకి ఎన్నో కలలు కని పంజాబీ రాష్ట్రం నుండి 16 సంవత్సరాల అమ్మాయి వచ్చిందని.. ఇక్కడ ఒక ప్రముఖుడు అవకాశాలు ఇప్పిస్తానని ఆ అమ్మాయి గర్భవతి చేయడం జరిగింది అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అమ్మాయిని బెదిరించి ఈ విషయం బయట పెడితే చంపేస్తామని.. హైదరాబాదులోనే ఆ అమ్మాయికి.. అబార్షన్ చేయించారని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి | Posani Krishna Murali Fires On Pawan Kalyan. పవన్ కళ్యాణ్‌పై నిప్పులు చెరిగిన పోసాని కృష్ణమురళి

ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మానసికంగా నలిగిపోతూ ఉంది. దమ్ముంటే ఆ అమ్మాయికి న్యాయం చేసి నీ నిజాయితీ నిరూపించుకో. సినిమాల్లో అమ్మాయిలపై డైలాగ్స్ చెప్పటం కాదు హీరోయిజం అంటే. రియల్ లైఫ్ లో కాపాడే వాడే హీరో. మీరు పవర్ స్టార్ కదా? ప్రశ్నించే గుణం ఉంది కదా? మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయండి. ఆ తరువాత ఎవ్వరి గురించైనా మాట్లాడండి’ అని పోసాని సంచలన కామెంట్స్ చేశాడు. నువ్వు గనక ఈ విషయంలో న్యాయం చేస్తే .. నీతో గుడి కడతాను అని పోసాని పేర్కొన్నారు. ఒకవేళ ఈ విషయంలో న్యాయం చేయలేక పోతే.. ఏపీ మంత్రులను విమర్శించే హక్కు నీకు లేదు అని కౌంటర్లు వేశారు. పవన్ కళ్యాణ్ నిలకడ లేని మనిషి అంటూ పోసాని మీడియా సమావేశంలో రెచ్చిపోయారు. పవన్ అన్నయ్య చిరంజీవి నీ.. ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుండి తాను చూస్తున్నానని ఆయన ఎక్కడా కూడా అమర్యాదగా మాట్లాడే మనిషి కాదని పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరైనా ప్రశ్నించవచ్చు.. ఆధారాలు ఉంటే నిలదీయ వచ్చు కానీ.. ఎటువంటి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రిని అదేరీతిలో మంత్రులను పెట్టడం సరైన విధానం కాదని అన్నారు.

జగన్ కి కుల పిచ్చి ఉందని పవన్ నిరూపించగలవా..?

జగన్ కి కుల పిచ్చి ఉందని పవన్ నిరూపించగలరా..??, చిరంజీవిని అదే రీతిలో ఆయన భార్య పవన్ వదిన సురేఖని తన ఇంటికి వచ్చినప్పుడు.. ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువా కప్పి వాళ్లతో భోజనం.. చేసిన వ్యక్తిత్వం కలిగిన మనిషి జగన్ అని పోసాని పేర్కొన్నారు. జగన్ తో పోల్చుకునే… వ్యక్తిత్వం కొద్దిగా నీకు ఉందా అని ప్రశ్నించారు. ఇంకా అనేక విషయాల గురించి పవన్ పై మీడియా సమావేశంలో.. పోసాని కృష్ణ మురళి రెచ్చిపోయారు. ఇదిలా ఉంటే పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఉన్నాయి. ఇంతకీ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలని వచ్చిన ఆ పంజాబీ అమ్మాయి.. ఎవరు అన్నదానిపై రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఏది ఏమైనా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఇండస్ట్రీ పరంగా పొలిటికల్ పరంగా పెను దుమారాన్ని రేపుతున్నాయి.


Share

Related posts

భారత్ మిమ్మల్ని ఎప్పటికీ మరిచిపోదు అటల్ జీ: మోదీ

Varun G

బ్రేకింగ్ : ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న దీపికా పడుకునే..! 

arun kanna

బిగ్ బాస్ 4: అతనే ఎంటర్టైన్మెంట్ అంటున్న లాస్య..!!

sekhar